ఈ రోజు స్పెషల్ ఆర్టికల్: 🔥 *కలియుగ వీధుల్లో మాయ యుద్ధం:*
*ప్రతి అడుగూ – పరీక్ష*
*ప్రతి చూపు – పోరాటం*
_____
*1. కలియుగ వీధులు రోడ్లు కావు... రణ రంగాలు!*
ప్రాచీన యుగాల్లో భోగాలూ, కామాంశాలూ దాచబడేవి.
ఇప్పుడు వీధుల్లో ఓ అడుగు వేసినా రీల్స్, హోర్డింగ్స్, ఫ్యాషన్, ఫోన్లలో చెడు... అన్నీ మన మీద దాడి చేస్తాయి.
బయట రోడ్డుపై వెళ్లేటప్పుడు, చెడు కనిపించే టప్పుడు
👉 మొదటి(సడన్ గా)చూపు – తప్పు కాదు.
జప శక్తి జ్ఞానంతో వెంటనే కృష్ణ సేవపై దృష్టి పెట్టాలి.
లేదంటే...
👉 రెండో చూపు – నీ పతనం.
👉 మూడో చూపు – నీ విధ్వంసం.
👉 నాలుగో చూపు – నీ భక్తి అంత్యక్రియ!
*2. మాయ కళ్ల ద్వారా దూసుకొస్తుంది – చిన్నగా తీసుకోవద్దు*
ఒక చిన్న చూపే – జపాన్ని బలహీనపరుస్తుంది
ఒక ఫోటోనే – మానసిక కల్లోలానికీ కారణం అవుతుంది.
ఒక మొబైల్ స్క్రోలే – నెలల తరబడి చేసిన సాధనను తుడిచేస్తుంది.
*3. బయట ఉన్నది శత్రువు కాదు – లోపలున్న కామమే నిజమైన శత్రువు*
📖 భగవద్గీత 3.37 – కామ ఏష క్రోధ ఏష...
బయట కనిపించే చెడు తప్పు కాదు.
జప శక్తి లేని కంట్రోల్ చేయని మన మనస్సే అసలైన శత్రువు.
మొదటి మన హృదయాన్ని శుభ్రం చేయాలి – ప్రపంచాన్ని కాకుండా.
*4. మొదటి చూపు అనుకోకపోవచ్చు – రెండో చూపు మాత్రం మాయతో ఒప్పందం. హరేకృష్ణ జపం చేయలేని వారికి మాయ బంధించి వేస్తుంది.*
📖 గీత 3.6 — బయట నియంత్రణ, లోపల కామం = మిథ్యాచారి
రెండో చూపు → చెడు చిత్తం బలపడుతుంది
→ చెడు బీజాలు పడతాయి
→ జపం బలహీనమవుతుంది
→ వైరాగ్యం తగ్గిపోతుంది
*5. ఎంతో చూడగలిగితే అంతగా బలహీనమవుతావు*
👉 మొదట చూస్తాం
👉 తర్వాత చిత్తాన్ని అందిస్తాం
👉 తర్వాత తపన
👉 చివరికి అనుచిత చర్య
చూసే ప్రతి సెకను → మన భక్తిని, జపాన్ని తినేస్తుంది.
*6. మనస్సు పొడి గడ్డి లాంటిది – మాయా ఒక చిన్ని నిప్పురవ్వ*
ఒక చిన్న reel, poster, memory కూడా మానసికంగా మనల్ని దహించేస్తుంది.
"బ్రహ్మ ముహూర్తంలో జపం చేయలేదంటే
అహంకారంతో నేను భక్తుడను అని మాయ ముందు నిలబెడితే అరసెకండ్ లో పవిత్రత ఆవిరైపోతుంది"
తన బలం పరీక్షించుకోవడం అహంకారమే.
*7. "నాకు కంట్రోల్ ఉంది!" అనేవాడు ముందే పడిపోతాడు*
🙏 "నేను బలవంతుడిని... నాకు మాయేమీ చెయ్యలేదు!"
ఈ మాటే మాయ మొదటి దెబ్బ!
అహంకారం = పతనపు ద్వారం
వినయం = రక్షణ కవచం
కృష్ణుడుకు సేవకుడిగా ఉంటే మాయ ఏమి చేయలేదు
ఎందుకంటే మాయ కంటే కృష్ణ శక్తివంతమైన వారు కాబట్టి.
*8. ఒక్కో అడుగూ – కృష్ణ కోసం పడాలని ఆలోచించు*
ప్రతి దారి ముందు ఆలోచించు:
🧭 "ఇది కృష్ణ సేవా కోసం వెళుతున్నానా? లేక నా ఈగో / ఇంద్రియాలకు ఆహారం కోసం?"
👉 వివేకం లేని ప్రయాణం = మాయ భోజనం
👉 మనం కృష్ణుడికి ఇచ్చిన కళ్ళను మాయా కోసం వాడితే, అది ద్రోహం
🙌 "తీర్థ దర్శనం కాని దారి వద్దకు వెళ్లకు!"
🔄 ప్రాక్టికల్ టిప్: See → Switch → Chant
కళ్ళు ఏదైనా పట్టుకుంటే...
వెంటనే చూపును తిప్పు
వెంటనే అంతరంగంగా జపం చెయ్: "కృష్ణా! కాపాడు!" హరేకృష్ణ మంత్రం జపించండి.
👉 ఇది పనిచేస్తుంది.
👉 కలియుగంలో మంత్ర జపమే మనసుని కాపాడేది.
👉 ఇంద్రియ సుఖం → బంధనం, పశ్చాత్తాపం
👉 నియంత్రణ → శాంతి, దైవిక బలం, కృష్ణ చిత్తం
నేను మనసును కాదు, శరీరాన్ని కాదు భగవంతుడు యొక్క సేవకుడిని ఈ ఉన్నతమైన సత్యంతో ఎల్లప్పుడు ఉండాలి. ఇది హరే కృష్ణ మంత్రం జపం చేస్తే మాత్రమే వస్తుంది.
*9. కలియుగంలో ఏకైక రక్షణ – హరినామామే!*
📜 హరే రామ హరే రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే only
బలహీన జపం = బలహీన మనస్సు = బలమైన మాయా
బలమైన జపం = బలమైన మనస్సు = రక్షిత ఆత్మ
💥 చివరి సంకల్పం:
❌ అర్థం లేని నడక వద్దు. భక్తి ఇవ్వలేని పనుల కోసం బయటికి వెళ్ళకండి.
❌ చెడు చూపుల(రోడ్డు పైన ఉన్న పరాయి స్త్రీ పురుష ) ఆటలతో సద్గతి పోగొట్టుకోకండి
❌ మాయా ఎత్తులు పరీక్షించకండి
✅ భక్తుల మధ్యలో ఉండు
✅ జపం గంభీరంగా చెయ్
✅ కృష్ణ ఇచ్చిన పనికే బయటికి వెళ్లు
నీ కాళ్లు కృష్ణ కోసం నడవాలి
నీ కళ్ళు కృష్ణుని దర్శించాలి
నీ మనస్సు కృష్ణుని రూపాన్ని స్మరించాలి
నీ నాలుక కృష్ణ నామం పదే పదే పలకాలి
అప్పుడు ఈ రణరంగం → గోలోక పథంగా మారుతుంది.
No comments:
Post a Comment