Friday, April 24, 2026

The Bitter Truth About Relationships | AHAM | నీ భార్య నీ సొంతం కాదు

The Bitter Truth About Relationships | AHAM | నీ భార్య నీ సొంతం కాదు

Author Name:AHAM

Youtube Channel Url:https://www.youtube.com/@ahamudt

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8YER-CrZb4w



Transcript:
(00:00) ఏంటి తంబ్నెల్ చూసి షాక్ అయ్యారా అసలే ఈ మధ్య భర్తల మీద దాడి చేస్తున్న భార్యల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి కదా అవును మళ్ళీ చెప్తున్నాను మీ భార్య మీ సొంతం కాదు మీరు అమ్మాయి అయితే మీకు చెప్తున్నాను మీ భర్త మీకు సొంతం కాదు ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఒక్క రెండు నిమిషాలు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. లవెట్ ఫస్ట్ సైటా అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైతే ఏంటి ఫస్ట్ టైం ఆమెను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ముందుగానే ఫైనాన్షియల్ లావాది వీళ్ళ గురించి ఆమెను చేసుకుంటే ఎంత కట్నం వస్తుంది ఆమె జాబ్
(00:44) చేస్తుందా చేయదా చేస్తే ఎంత బెనిఫిట్ చేయకపోతే ఏంటి పరిస్థితి ఇలాంటివన్నీ లెక్క వేసుకున్న తర్వాతే కదా పెళ్లి చూపులు కూర్చుంటారు. ఇక పెళ్లి చూపులో కూర్చున్న తర్వాత ఆమెను చూసి తనను తన పేరెంట్స్ ను సరిగా చూసుకుంటుందా తన ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా అనే అంచన వేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొంచెం బోల్డ్ గా అనిపించినా తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండోయి వీటితో పాటు ఆమె అందచందాలు తన టేస్ట్ కి తగినట్లు ఉన్నాయా లేదా అనే విషయం కూడా లెక్క వేసుకుంటాడు ఆ కుర్రాడు.
(01:14) అన్ని లెక్కలు సరిపోయి ఆమె రాకతో తన లైఫ్ తన ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది అనుకుంటేనే కదా ఓకే చేస్తాడు అతడు. అదే లవ్ మ్యారేజ్ అయితే ముందుగా అమ్మాయిని చూసి టెంప్ట్ అయ్యి తర్వాత మిగిలిన విషయాలు లెక్కేస్తాడు. తేడా వస్తే లవ్ బ్రేకప్ అవుతుంది సింపుల్ ఇక్కడ విషయం ఏంటంటే అబ్బాయి ఎన్ని లెక్కలు వేసుకుంటాడో అమ్మాయి కూడా అన్ని లెక్కలు వేసుకుంటుంది.
(01:37) అబ్బాయి మరీ గొప్ప అందగాడు కాకపోయినా ఒక మాదిరిగా అయినా ఉండాలి. మంచి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ బాగా సంపాదించేవాడై ఉండాలి. అప్పటికే కొంత ఆస్తిపాస్తులు ఉంటే మరీ మంచిది. ఇతగాడితో నా లైఫ్ బాగుంటుంది అనుకుంటేనే ఆమె కూడా ఓకే చేస్తుంది. దీన్ని బట్టి మనక ఏం అర్థం అవుతుంది? ఇక్కడ ఇద్దరూ కూడా అవతలి వారి లైఫ్ ని బాగు చేద్దామని కాదు అవతలి వారి వలన తన లైఫ్ బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తోనే రిలేషన్ లోకి ఎంటర్ అవుతారు.
(02:06) దీని అర్థం ఏంటంటే మీ పార్ట్నర్ మీకోసం మీ లైఫ్ లోకి రాలేదు. తనకోసం తన లైఫ్ లోకి మీకు తోటి ఇచ్చారు. అందుకే చెప్తున్నాను మీ భార్య మీ సొంతం కాదు మీ భర్త మీ సొంతం కాదు మీ పార్ట్నర్ మీ ప్రాపర్టీ అసలే కాదు మీ లెక్కలు మీకు ఉన్నట్లే అవతల వారికి కూడా వారి లెక్కలు వారికి ఉంటాయి. అందుకే భార్యా భర్తల రిలేషన్ అయినా సరే ఒక బిజినెస్ అగ్రీమెంట్ లాంటిదే ఇచ్చి పుచ్చుకునే లెక్కలు సరిగా ఉంటేనే ఆ రిలేషన్ ఆరోగ్యకరంగా ఉంటుంది.
(02:39) లేకపోతే లేకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు. సరే ఈ పాయింట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల లోతుల్లోకి వెళ్లి చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. థాంక్యూ గుడ్ బాయ్.

No comments:

Post a Comment