అశ్లీల ఆలోచనల నుండి నీ మనసుని ఎలా కాపాడుకోవాలి | Buddhist story relax your mind | devil is back
Author Name:DEVIL IS BACK
Youtube Channel Url:https://www.youtube.com/@-Devil-is-back
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zBsem_jeYAA
Transcript:
(00:01) ఒకసారి ఒక యువకుడు గౌతమ బుద్ధుడు దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు బుద్ధ నా మదిలో ఎందుకు ఇంత నీచమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇలాంటి నీచమైన ఆలోచనలు నాకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా సరే నా మనసు నిరంతరం కామపు ఆలోచనలతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఆలోచనల వల్ల నేను చాలా బాధపడుతున్నాను. నా శక్తి, సమయం, నిద్ర వృధా అవుతున్నాయి.
(00:27) అంతేకాకుండా ఈ ఆలోచనల వల్ల నేను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను. [సంగీతం] నేను ఎప్పుడు స్త్రీల పట్ల ఆకర్షితుల అవుతున్నాను. ఎంతటి ముఖ్యమైన పనిలో ఉన్నా ఈ ఆడచనలు నా మదిలో నిరంతరం [సంగీతం] మెదులుతూనే ఉన్నాయి. ఫలితంగా నా పనిలో నేను నిమగ్నం అవ్వలేకపోతున్నాను. దయచేసి ఈ సమస్య నుండి నన్ను బయటపడే మార్గాన్ని సెలవివ్వండి అని ఆ బుద్ధుని వేడుకుంటాడు.
(00:56) అప్పుడు బుద్ధుడు చిన్నగా చిరునవ్వు నవ్వి ఆ యువకుడితో కామం అంటే ఏంటో నీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. ఆ బాలుడు బుద్ధ కామం అంటే నాకు తెలియదు కానీ అది చెడ్డ అలవాటు ఆ ఆలోచన నుండి నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను. అప్పుడు ఆ బుద్ధుడు యువకుడితో ఇలా అంటాడు అన్నిటికంటే ముందు మనలో సహజంగా ఉన్నవన్నీ చెడ్డ ఆలోచనలు కావని నువ్వు అర్థం చేసుకోవాలి.
(01:24) మన జీవితంలో ఎంత వద్దనుకున్నా అవి ఖచ్చితంగా కొంత ఉంటాయి. కామం చెడ్డ విషయం ఏమీ కాదు అది మన మనసులోని ఒక బాహుద్వేగం ఆ ఆలోచన మనకు ఏదో లోటు ఉందని భావించేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ లోటును తీర్చుకునే క్రమంలో ఒక మనిషికి లేదా వస్తువుకు ఆకర్షితులం అవుతాము. [సంగీతం] మీకు డబ్బు లేకపోతే దానిపై మీకు కోరిక కలుగుతుంది. నిజానికి కామం అనేది ఒక రకమైన కొరత.
(01:53) ఆ కొరత కేవలం భావన తప్ప మరేమీ కాదు ఆ కోరిక శారీరకంగా ఎక్కువైనప్పుడు దానిని మనం కామం అంటుంటాం. అప్పుడు ఆ యువకుడు గౌతమ బుద్ధునితో నేను కామం యొక్క అర్థం తెలుసుకున్నాను. కానీ దయచేసి నాలో ఎక్కడి నుండి ఆ కామ కోరికలు పుడుతున్నాయో ఎలా వచ్చాయో చెప్పండి అని గౌతమ బుద్ధుని వేడుకుంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు కామం చరిత్ర నుండి రాలేదు. అది మనలోనే [సంగీతం] ఉంటుంది.
(02:21) మరియు దాని ఉనికి అత్యవసరం కూడా అప్పుడే మానవజాతి విస్తరిస్తుంది. [సంగీతం] అప్పుడు ఆ యువకుడు అది మనలోనే ఉంటే అంత పవిత్రమైనది అయితే ప్రజలు దానిని ఎందుకు తప్పు అంటారు అని [సంగీతం] ప్రశ్నిస్తాడు. అప్పుడు బుద్ధుడు అదే పెద్ద సమస్య. ప్రజలు కామాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు దానిని దాచడానికి మరియు అణచి వేయడానికి ప్రయత్నిస్తారు. కామం ఉండడం తప్పు కాదు కానీ తమ కామాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించడం తప్పు ఒక వ్యక్తి మరో వ్యక్తిపై మోహాన్ని పెంచుకొని కేవలం ఒకే ఆలోచనతో ఆ వ్యక్తిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే గాఢమైన కోరికలతో ఆ వ్యక్తిని మదిలో అసభ్యకరంగా ఊహించుకుంటూ తన సమయాన్ని
(03:03) లక్ష్యాలను వదులుకొని చేయవచచ్చిన జీవజావంలా మారిపోతారు. తాము ఆ ఆలోచనతో ఎంత బాధపడుతున్నామో గమనించలేకపోతారు. ఆఖరికి తమ కోరికను తీర్చుకోవడానికి ఎంతటి స్థితికైనా దిగజారుతారు. బుద్ధుడు ఆ యువకుడితో జంతువులకు కూడా కామం ఉంటుందని నీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యువకుడు అవును బుద్ధ జంతువులకు కూడా కామకూరికలు ఉంటాయి.
(03:30) అయితే మనం జంతువుల కామాన్ని ఎందుకు తప్పు అని అనము అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు కొద్ది సమయం ఆలోచించి ఈ విషయం గురించి నాకు తెలియదు మహాత్మ మీరే చెప్పండి అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు జంతువులు తమ కామాన్ని సుఖం కోసం ఉపయోగించవు కేవలం దానిని సంతానోత్పత్తి కోసమే ఉపయోగిస్తాయి. అంతేకాకుండా తమ కామ కోరికలతో [సంగీతం] ఎల్ల తరబడి తమ సమయాన్ని వృధా చేసుకో అని చెప్తాడు.
(03:59) జంతువులకు లైంగిక వాంచను తమ ఆనందానికి ఆధారంగా చేసుకునే జ్ఞానాన్ని ప్రకృతి ఇవ్వలేదు. కానీ మానవులు తమ జ్ఞానంతో ప్రకృతిలోని [సంగీతం] ప్రతి జీవిని తమ ఆనందం కోసం వాడుకుంటారు. మనం మానవులం గనుక లైంగిక వాంఛను మన ఆనందానికి ఒక సాధనగా మార్చుకున్నాము. మన వంశాన్ని కొనసాగించడానికి ప్రకృతి దానిని మనకు ఇవ్వడం జరిగింది. కానీ మానవులు దానిని మన జీవితాల అంతిమ లక్ష్యంగా చేసుకున్నారు.
(04:26) అందువల్ల తేలికపాటి కోరికలను కూడా మనం నియంత్రించలేకపోతున్నాం. అప్పుడు ఆ యువకుడు గురుదేవా ఈ నీచమైన కోరికలు మనల్ని ఎందుకు ఇంతలా బాధిస్తున్నాయి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా అంటాడు ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు కామం పై ఒక పూర్తి అవగాహన వస్తుంది.
(04:49) కామాన్ని ఎలా నియంత్రించాలో తెలుస్తుంది. అంతేకాకుండా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా లభిస్తుంది. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక గురువు మరియు అతని శిష్యులు నివసించేవారు. వారు ప్రతిరోజు భిక్షాటన కోసం ఆశ్రమం బయట ఉన్న గ్రామానికి వెళ్లేవారు. కానీ ఆ ఆశ్రమానికి చెందిన ఒక శిష్యుడు భిక్షాటన కోసం ఒక గ్రామానికి వెళ్తుండగా అతనికి దారిలో ఒక నది ఎదురైంది.
(05:15) ఆ నదిని ఎలా దాటాలో ప్రయత్నిస్తున్నప్పుడు [సంగీతం] ఒక పెద్ద మరి వృక్షం వెనక ఒక యువకుడు నది వైపు [సంగీతం] తొంగి తొంగి చూస్తూ ఉండడాన్ని ఆ శిష్యుడు గమనిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ యువకుడి దగ్గరికి వెళ్లి అన్నా ఈ చెట్టు వెనక దాక్కొని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుని ఏయ్ నేను ఏం చేస్తున్నానో నీకు కనిపించడం లేదా ఒక్కసారి ఈ అందమైన నది దిక్కు చూడవోయి ఆ అందమైన నదిలో [సంగీతం] అందమైన అమ్మాయిలు నీళ్లు నింపుకోవడాన్ని ఒక్కసారి చూడవోయి అని ఆ యువకుడు బదిలిస్తాడు.
(05:49) అప్పుడు ఆ శిష్యుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు నీళ్లు నింపుకోవడం చూశాడు. వాళ్ళ వయసు 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది. అప్పుడు ఆ యువకుడితో అన్నా అక్కడ అమ్మాయిలు నీళ్లు నింపుకుంటున్నారు. ఇలా దొంగచాటుగా చూడడం ఎందుకు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ యువకుడు శిష్యుడి వైపు చిరాకుగా చూస్తూ ఏయ్ మూర్ఖుడా ఈ దేవకన్యలు నదిలో నుంచి నీళ్లు ఎలా తోడుతున్నారో నీకు కనిపించడం లేదా వాళ్ళ అందాన్ని మృదువైన శరీరాలను నాజుకైన నడుములను అందం అమ్మకానికి పెట్టినట్టుగా నడుము చుట్టూ జాలువారుతున్న జుట్టును చూడు అని అంటాడు.
(06:25) శిష్యుడు మళ్ళీ నది వైపు చూశాడు. ఈసారి అమ్మాయిలనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇలా కొంత సమయం కొనసాగింది. ఇలా చూడటాన్ని ఎవరైనా గమనిస్తే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు. కానీ ఈ దృశ్యం చాలా బాగుంది అని ఆ యువకుడితో పాటు ఆ చెట్టు వెనుకాలకి వెళ్లి ఆ అమ్మాయిలని దొంగి తొంగి [సంగీతం] చూడడం మొదలు పెడతాడు.
(06:48) అతను వాళ్ళను అలా నిశ్చితంగా చూస్తుండగా అకస్మాతుగా అతనిలో ఏదో తెలియని అనుభూతి [సంగీతం] శారీరక మార్పులు కలగడం తాను గమనిస్తాడు. నేను ఏం చేస్తున్నాను నేను చేస్తున్నది తప్పు [సంగీతం] నేను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అతను అనుకున్నట్టుగానే వెంటనే బయలుదేరి ఆశ్రమానికి చేరుకుంటాడు. [సంగీతం] ఆశ్రమానికి చేరుకున్నాక అతను తన పనిలో నిమగ్నమయ్యాడు.
(07:16) కానీ అతను చూసిన దృశ్యం పదే పదే అతని మదిలో మెదులుతూనే ఉంది. అతని మనసు మళ్ళీ అదంతా చూడడానికి ఆరాటపడుతుంది. అతని మనసు ఏ పని చేయడానికి సుముఖంగా లేదు. ప్రతి ఉదయం అతను భిక్షాడన కోసం ఆశ్రమం నుండి తొందరగా బయలుదేరేవాడు. అతను నది దగ్గర ఉన్న అదే మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి అప్పటికే అక్కడ ఉన్న యువకుడితో కూర్చునేవాడు.
(07:41) ఆ యువకుడితో కలిసి రహస్యంగా అమ్మాయిలను చూసి సంతోషపడేవారు. ఇప్పుడు అతను ప్రతిరోజు ఇలా చేయడం వల్ల దినచర్యగా మారిపోయింది. ఆఖరికి అప్పుడు ఆ యువకుడికి తన మనసు ఏమి చేయడానికి సుముఖంగా లేదు అన్నట్టుగా అనిపించడం మొదలయింది. అతను ఎప్పుడూ ఏదో ఒక కామపు ఆలోచనతో మునిగిపోయి ఉండేవాడు. అతను ఆశ్రమం యొక్క పనిని కూడా సరిగ్గా చేస్తూ ఉండేవాడు కాదు అంతేకాకుండా అతను సరిగ్గా నిద్రపోవడం గాని తినడం గాని చేసేవాడు కాదు అతని మనసు అశాంతితో ఉండి ఆ అమ్మాయిల అందాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అతని మనసు [సంగీతం] పరితపించేది.
(08:19) గురువు పాఠాలను బోధిస్తున్నప్పుడు కూడా కళ్ళు మాత్రం గురువు వైపు అతని మనసు మాత్రం అశ్లీల ఆలోచనలతో మునిగిపోయేది. ఒకరోజు తన శిష్యుడు ఆలోచనల గురించి గురువుకు తెలిసిపోయింది. ఒకరోజు గురువు [సంగీతం] తన శిష్యుడిని పిలిచి ఈ రోజు నుండి నేను కూడా నీతో భిక్షాటనకు వస్తాను. నువ్వు నేను కలిసి భిక్షాటనకు [సంగీతం] వెళ్దామని అంటాడు.
(08:42) అప్పుడు ఆ శిష్యుడు నిరాకరిస్తూ వద్దు గురుదేవా మీరెందుకు అంత ఆందోళన చెందుతున్నారు నేను ఒంటరిగా క్రమశిక్షణగా భిక్షాటన చేయగలను అని అంటాడు. దానికి గురువు పర్వాలేదు నువ్వు ఒంటరిగా భిక్షాటన చేయవచ్చు అని నీకు అడ్డు రాను అని శిష్యుడితో అంటాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు వెంటనే భిక్షాటనకు బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళాక ఆ గురువు కూడా తన శిష్యుడు ఏం చేస్తున్నాడో చూడడానికి అతన్ని అనుసరించడం మొదలు పెడతాడు.
(09:12) కొంత దూరం నడిచిన తర్వాత గురువు తన శిష్యుడు ఒక నేరస్తుడిలా ఒక యువకుడితో కలిసి చెట్టు వెనుక దాక్కొనిగి ఏదో చూస్తుండడం గమనించాడు. తన శిష్యుడు ఒక నేరస్తుడిలా చెట్టు వెనుక ఎందుకు దాక్కున్నాడో అసలు ఏం చేస్తున్నాడో చూడడానికి గురువు వారికి తెలియకుండా వారి వెనకకు వచ్చి నిలబడతాడు. తన శిష్యుడు చెట్టు వెనక దాక్కొని నది నుండి నీళ్లు నింపుకుంటున్న అమ్మాయిలను చూస్తున్నట్టు గురువు గమనిస్తాడు.
(09:39) అప్పుడు గురువు గట్టిగా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. గురువు స్వరం వినగానే శిష్యుడు భయపడి శిష్యుడికి చెమటలు పట్టడం ప్రారంభిస్తాయి. దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగల వనకడం మొదలు పెడతాడు. భయంతో అతను ఏమీ మాట్లాడడం లేదు. అతన్ని నోటి నుండి కొన్ని విరిగిన మాటలు మాత్రమే వస్తున్నాయి. అతను తన గురువు వైపు కూడా చూడడం లేదు.
(10:04) గురువు శిష్యుడి వైపు చూసి ఇంతవరకు నా శిష్యుడు ఎప్పుడూ భయపడలేదు కానీ ఇదేమిటి నువ్వు ఇప్పుడు భయంతో వనికిపోతున్నావు అప్పుడు శిష్యుడు గురుదేవా ఇది నా తప్పు కాదు ఆ యువకుడు నన్ను పక్కదారి పట్టించాడు కానీ ఈరోజటి నుండి ఇలాంటి తప్పు పనులు చేయనని వాగ్దానం చేస్తాడు. నేను మళ్ళీ ఇలా ఎప్పటికీ చేయను దయచేసి నన్ను క్షమించండి గురుదేవా అని తన గురుదేవుని వేరుకుంటాడు.
(10:31) అప్పుడు గురువు శిష్యునితో పర్వాలేదు కానీ మనం మన సాంగత్యం యొక్క [సంగీతం] ఫలాలను పొందుతామని గుర్తుంచుకో మన స్నేహితుల యొక్క ఆలోచనలు మనలోకి కూడా ప్రవేశిస్తాయి. మంచి స్నేహితులతో సాంగత్యం చేసినప్పుడే నీలో మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి అని ఆ శిష్యునితో అంటాడు. ఆ తర్వాత గురు శిష్యులు ఆశ్రమానికి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం పనిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు.
(10:58) అతను తన చెడ్డ మార్గాన్ని వదిలిపెట్టి ఎప్పటిలాగే తన మార్గంలో ప్రయాణిస్తూ ఆశ్రమం పనిలో నిమగ్నమై ఉంటాడు. కానీ ఆరోజటి నుండి క్రమంగా అతనిలో కోపం పెరిగింది. ఆ తర్వాత అతను ఇతరులోపై [సంగీతం] కోపగించుకుంటూ అశాంతితో ఉండేవాడు. అతను సరైన సమయంలో భజనాలు కూడా చేసేవాడు కాదు చాలా తక్కువగా తిని ఎక్కువగా ఆలోచించేవాడు. ఇదంతా గమనించిన తన గురువు ఒక రాత్రి శిష్యుని దగ్గరికి వచ్చి నువ్వు నీ మాటలు ఎన్నిసార్లు తప్పుతావు అని [సంగీతం] ప్రశ్నిస్తాడు.
(11:30) ఇదంతా విని శిష్యుడు తన గురువు పాదాలపై పడి ఏడవడం ప్రారంభిస్తాడు గురుదేవా నేను నా మాటను చాలాసార్లు [సంగీతం] తప్పాను. మాట ఇచ్చిన ప్రతిసారి నా మాటను తప్పుతున్నాను. ఎందుకంటే నా మనసు నా అదుపులో లేదు నా మనసులోని చెడు ఆలోచనలన్నింటిని తొలగించడానికి నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఎంత ప్రయత్నించినా నేను అలా చేయలేకపోతున్నాను.
(11:55) అప్పుడు ఆ గురువు శిష్యుడిని ఆశ్రమం తోటలోకి తీసుకువెళ్లి ఆ శిష్యుడితో చూడు ఇక్కడ కొన్ని కాలువలు ఉన్నాయి. ఈ కాలువలోని నీరంతా పక్కనున్న నది నుండి వస్తుంది. ఈ కాలువలో ఉన్న ఏ ఒక్క నీటి కాలువనైనా నీవు ఆపగలవా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు అవును గురుదేవా నేను ఈ కాలువ నీటిని ఆపగలను అని అంటాడు.
(12:19) ఆ తర్వాత ఆ శిష్యుడు కొంత మట్టిని తీసుకువచ్చి ఆ కాలువకు అడ్డంగా వేస్తాడు. నీరు కాసేపు ఆగి నీరు ఆ మట్టిపై నుండి ప్రవహించడం మొదలు పెడుతుంది. అప్పుడు గురువు ఆ శిష్యునితో ఓయ్ ఇదేంటి నీరు అస్సలు ఆగడం లేదు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు కొన్ని గులకరాలు మట్టి తెచ్చి కాలువకు అడ్డుకట్టగా వేయడం జరుగుతుంది. కొద్ది సమయం తర్వాత ఆ నీరు ఆ గులకరాల మధ్య నుండి ప్రవహించడం ప్రారంభిస్తుంది.
(12:46) అప్పుడు ఆ గురువు శిష్యుడితో ఏమైంది నీరు మళ్ళీ ప్రవహించడం మొదలైంది నువ్వు దాన్ని ఆపగలవా లేదా అని తిరిగి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఈ నీటిని ఎలా ఆపాలో నాకు తెలుసు [సంగీతం] ఇప్పుడు చూడండి అని అతను ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ఆ చిన్న కాలువకు అడ్డంగా పెడతాడు. అప్పుడు ఆ శిష్యుడు చూడండి గురుదేవా నీళ్లు ప్రవహించనివ్వకుండా చేస్తానని చెప్పాను కదా నా మాట నేను నిరూపించుకున్నాను అని ఆ గురువుతో చెప్పడం జరుగుతుంది.
(13:17) అప్పుడు ఆ గురువు చిన్నగా నవ్వి ఆ శిష్యుడితో అక్కడే కాసేపు కూర్చుంటాడు. సరే శిష్య ఈసారి జాగ్రత్తగా చూడు నీవు ఆపిన ఈ నీరు దాని వెనకాలే ఉన్న మరో కాలువను బద్దలు కొట్టుకొని ఆ కాలువ నుండి ఈ నీరు మన తోటలోకి ప్రవేశిస్తుంది అని అనడం జరుగుతుంది. అప్పుడు ఆ శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాక తన దలదించుకొని భూమి వైపు చూడడం మొదలు పెడతాడు.
(13:44) ప్రస్తుతం నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నీవు పదే పదే నీ కోరికలను ఆపడానికి ప్రయత్నిస్తున్నావు దానికి గొప్ప గొప్ప ప్రయత్నాలు కూడా చేస్తున్నావు. కానీ ప్రతిసారి నీ ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి. మరియు ఆ కోరికలు ఏదో ఒక రూపంలో నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయి. నీరు లోతట్టు భాగానికి వెళ్ళడానికి కొత్త దారి చేసుకుంటూనే ఉంటుంది.
(14:07) అప్పుడు ఆ శిష్యుడు అయితే గురుదేవా ఈ చెడు ఆలోచనల నుండి నేను విముక్తి పొంది శాంతి పొందడానికి మార్గం లేదా ఈ ఆలోచనలు నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని తన గురుదేవుని వేడుకుంటాడు. అప్పుడు ఆ గురువు చిన్నగా నవ్వి తోటలోకి నీరు వస్తున్న నది మూలం దగ్గరికి తన శిష్యుడిని తీసుకెళ్లి శిష్యుడితో ఇలా అంటాడు. ఈ నది నుండి నీరు మన తోటలోకి ప్రవహిస్తుంది.
(14:34) మనం ఇక్కడ నీటి ప్రారంభ దశ మార్గాన్ని అడ్డుకుంటే మన తోటలోకి వచ్చే నీటిని అడ్డుకోలేమా అని శిష్యుని గురువు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు అవును గురుదేవా ఇది తప్పకుండా సాధ్యమే. నేను ఈ నీటిని మొదట్లోనే అడ్డుకుంటే మన తోటలో ఉన్న ఏ ఒక్క కాలువకు నీరు ప్రవహించదు. ఆ శిష్యుడు మళ్ళీ ఎంతో కష్టపడి మట్టి గులకరాళ్లను వేసి నది నుంచి వచ్చే నీటి మార్గాన్ని మూసివేస్తాడు.
(15:00) చూసావా గురుదేవా నేను ఈ నీటిని అడ్డుకున్నాను. ఇప్పుడు ఈ నీరు తోటలోకి అస్సలు వెళ్ళదు అని గురుదేవునితో చెప్తాడు. అప్పుడు ఆ గురువు తోటలోకి నీరు వెళ్ళకపోతే మొక్కలకు నీరు ఎక్కడి నుండి వస్తుంది. ఆ చెట్లల్లో మొక్కల్లో కొన్నింటికి రోజు నీరు అవసరం. ఆ నీరు అందకపోతే అవి వాడిపోయి చనిపోతాయి. మనం ఈ నీటి కాలువను తెరవాలి.
(15:26) గురువు మాటలు విని శిష్యుడు మళ్ళీ నది నుండి వస్తున్న నీటి మార్గాన్ని తెరిచాడు. అప్పుడు గురువు ఈ నదిలోని నీటినంతటిని తోట వైపు మల్లిస్తే ఏం జరుగుతుంది అని ఆ శిష్యుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా అక్కడ ఉన్న చెట్లు మొక్కలన్నీ కుల్లిపోతాయి. నాశనం అవుతాయి కూడా [సంగీతం] చివరికి అక్కడ ఏమి మిగలదు అని బదులిచ్చాడు.
(15:49) అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి నీకు అర్థమైందా మనం దేనిని ఆపనవసరం లేదు మనం ఎల్లప్పుడూ సమతుల్యాన్ని పాటించాలి. [సంగీతం] నీరు ఎక్కువైనా మొక్కలు నాశనం అవుతాయి. నీరు తక్కువైనా మొక్కలు ఎండిపోతాయి. ఇవి జరగకుండా చూడడమే సమతుల్యం. తిరిగి గురువు శిష్యునితో నీవు మామిడి పండును జట్టి పరిస్థితుల్లో [సంగీతం] ఇప్పుడు ఊహించుకోవద్దు అని ఆదేశం ఇస్తాడు.
(16:12) అప్పుడు ఆ శిష్యుడు నివ్వరపోతూ గురువు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు ఆ గురువు చిన్నగా నవ్వి మామిడి పండు గురించి ఆలోచించొద్దు అని అంటే నీకు మొదట ఏ రూపం గుర్తొచ్చింది అని ఆ శిష్యుని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు చిన్నగా నవ్వి నాకు మామిడి పండే గుర్తొచ్చింది గురుదేవా అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ గురువు శిష్యునితో మనం చెడు ఆలోచనలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించినప్పుడు అవి మరింత బలంగా మనలోకి ప్రవేశించి మరింత తీవ్రంగా తయారవుతాయి.
(16:45) అందువల్ల మనం వాటిని ఎప్పుడూ అణచివేయడానికి ప్రయత్నించకూడదు అని అంటాడు. అంతేకాకుండా చెడ్డ వ్యక్తుల సాంగత్యం వల్ల కూడా మనకు చెడు ఆలోచనలు వస్తాయి. తరుచుగా జరిగేది ఏమిటంటే సాధారణంగా మనలో లైంగిక వాంచ ఉండదు కానీ కొంతమంది అసభ్యకరమైన వ్యక్తులతో ఉండడం వల్ల అది మనలో ప్రబలిపోతుంది. అప్పుడు శిష్యుడు గురుదేవా మీరు చెప్పింది నిజమే నేను నా మార్గం నుండి తప్పిపోయాను అని అన్నాడు.
(17:13) గురువు చెప్పినదంతా విన్న ఆ శిష్యుడికి ఆ తర్వాత [సంగీతం] ఏం చేయాలో పూర్తిగా అర్థమైపోయింది. శిష్యుడు వెంటనే ఆశ్రమానికి వెళ్లి కడుపునిండా ఆహారం తిని ఆ రాత్రంతా గాఢంగా నిద్రపోతాడు. అతను ఉదయం నిద్ర లేచిన వెంటనే తన పనులను పూర్తి చేసుకొని ఆ తర్వాత భిక్షాటన కోసం అదే దారిలో వెళ్తాడు. ఆ దారిలో ఆ యువకుడు ఇంకా ఆ చెట్టు వెనుక [సంగీతం] దాక్కొని ఆ అమ్మాయిలను చూస్తూనే ఉంటాడు.
(17:38) ఆ శిష్యుడు నేరుగా అమ్మాయిలు నీళ్లు నింపుకుంటున్న నది దగ్గరికి వెళ్లి అతను ఆ అమ్మాయిలను నీళ్లు అడుగుతాడు. ఆ అమ్మాయిలలో ఒకరు అతనికి నీళ్లు ఇచ్చి తన దాహాన్ని తీరుస్తారు. అప్పుడు ఆ శిష్యుడు తనకు నీళ్లు ఇచ్చిన అమ్మాయిల పాదాలకు నమస్కరించి ఆ శిష్యుడు ఆ అమ్మాయిలతో ఆ అన్నపూర్ణ దేవి నిన్ను చల్లగా చూడాలి గాక అమ్మ నా కడుపు నింపినందుకు ధన్యవాదాలు అని కృతజ్ఞత భావంతో ఆశీర్వదిస్తాడు.
(18:05) అప్పటి నుండి అతనిలో సానుకుల శక్తి నిండిపోయింది. తాను పోగొట్టుకున్నది ఏదో దొరికినట్టుగా అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. తిరిగి అతను తన దారిలో వెళ్తుండగా సరిగ్గా అప్పుడే చెట్టు దగ్గర ఉన్న యువకుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ యువకుడు ఏయ్ ఏమైంది ఈరోజు నీకు అని అరుస్తాడు. మొదట నన్ను కూడా కలవకుండా నేరుగా ఆ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వెళ్తే వెళ్ళావు ఆ అమ్మాయి దగ్గర ఆ పిచ్చి మాటలు ఏంటి అని ఆవేశంతో ఆ శిష్యుడిని ప్రశ్నిస్తాడు.
(18:37) అప్పుడు ఆ శిష్యుడు మనం ఎప్పుడూ ఇతరులను చూడటంలోనే నిమగ్నమై మనల్ని మనం మర్చిపోతున్నాము. ఇంకెంతకాలం ఈ చెట్టు వెనుక దాక్కుంటూ ఉంటావు. ఆ అమ్మాయిలలో నీకు ఎవరైనా నచ్చితే ఆ అమ్మాయి దగ్గరికి నేరుగా వెళ్లి నీ ఉద్దేశాన్ని చెప్పు కానీ అంతకంటే ముందు నీవు ఏదైనా సాధించి నిన్ను నువ్వు నిరూపించుకో నీవు ఆ అమ్మాయిని సాకగలవు అనే భరోసా ఆ అమ్మాయికి కల్పించు అంతేకానీ దయచేసి ఇలా [సంగీతం] నీ సమయాన్ని వృధా చేసుకోకు అని ఆ యువకుడితో అనడం జరుగుతుంది.
(19:11) ఆ తర్వాత ఆ శిష్యుడు ఆ యువకుడిని నది దగ్గర చూసింది లేదు ఆ తర్వాతి రోజు నుండే ఆ యువకుడు జీవితంలో ఏదైనా సాధించడానికి పోరాడటం మొదలుపెట్టాడు. ఈ కథ చెప్పి బుద్ధుడు శిష్యుడితో ఈ విధంగా అంటాడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా నీలో చెడు ఆలోచనలు వస్తుంటే వాటిని ఆపే ప్రయత్నం చేయొద్దు.
(19:35) ఎందుకంటే ఈ ఆలోచనలు చెడు ఊహలు ఆది నుంచి అనంత వరకు ఉన్నాయి. కేవలం ఆ ఆలోచనలను అర్థం చేసుకొని ఆ సమస్య యొక్క మూలం దగ్గరికి వెళ్లి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడే నీ సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తుంది. ఒక్కటి గుర్తుకు పెట్టుకో జీవితంలో సమయం ఎప్పుడూ వృధా చేయొద్దు ఎందుకంటే గడిచిన క్షణాన్ని ఈ భూమ్మీద ఏ విలువైన వస్తువు ఇచ్చినా తిరిగి వెనక్కి తీసుకురాలేము.
(20:01) అంతటి విలువైనది నీ సమయం [సంగీతం] అని ఆ శిష్యుడిని ఆశీర్వదించి ఆ శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజటికి ఇంట్రెస్టింగ్ విషయం. మరోరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు ఉంటా అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.
No comments:
Post a Comment