Friday, May 1, 2026

తెలుగు సినిమాల్లో అధర్మ సన్నివేశాలు / Unethical Scenes In Telugu Movies

తెలుగు సినిమాల్లో అధర్మ సన్నివేశాలు / Unethical Scenes In Telugu Movies

Author Name:Hindu Dharma Chakram - హిందూ ధర్మచక్రం

Youtube Channel Url:https://www.youtube.com/@HinduDharmaChakram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ct11TxIx5Q4



Transcript:
(00:09) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్ కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసమ ఆధ్యాత్మిక సమాచారం కోసం దేశం కోసం ధర్మం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. [బెల్] ఇటీవల కాలంలో నేను ఈ మధ్యలోనే ఒక సినిమా చూశాను టీవీలో ఏంటి ఆ సినిమా నమో వెంకటేశ తెలుగు సినిమా ఇందులో హీరో వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారు హీరోయిన్ వచ్చేసి త్రిష గారు ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సీను వైట్ల గారు ఇప్పుడు ఈ సినిమా సుమారు ఒక 10 12 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా ఇప్పుడు ఈ సినిమా గురించి
(00:53) మాట్లాడుతున్నాను అనింటే కారణ ఉంది రీసెంట్ గా నేను టీవీలో చూశను గనుక చూస్తూ ఉంటే అందులో ఒక పాట ఆ కనిపించి దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి ఆ పాట అంటే ఇందులో హీరో హీరోయిన్లు వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక పాట పాడుతూ ఉంటారు. భక్తులు ఆ దేవుని గురించి సినిమాల్లో పాడటం అనేటువంటిది చాలా సినిమాల్లో ఉండేటువంటిదే తమకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కానివ్వండి తమ కోరికలను కానివ్వండి ఆ తమ బాధలను కానివ్వండి కష్టాలను కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా భగవంతునికి చెప్పుకునేటువంటి సందర్భంగా ఒక
(01:34) పాట రూపంలో సినిమాలో ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేస్తారు అది ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట ఆ సాంగ్ అదేవిధంగా ఈ నమో వెంకటేశ అనేటువంటి సినిమాలో హీరో హీరో హీరోయిన్లు త్రిషా వెంకటేష్ గారు ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక పాట పాడతారు. ఆ పాటలో నేపథ్యం ఏంటంటే తమ పెళ్లికి వెంకటేశ్వర స్వామి వారిని ఆహ్వానిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతోటే తమ పెళ్లి అవుతున్నట్టు కనుక ఆ స్వామి వారి యొక్క ఆశీసులతో పెళ్లి చేసుకోబోతున్నాం కనుక స్వామి వారికి రుణపడి ఉన్నాము రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము ఈ పెళ్లి
(02:13) ఏర్పాటు చేస్తున్నాము అని ఆ పాట యొక్క నేపత్యం దాన్ని కన్వేస్తుంటారు స్వామి వారికి ఇద్దరు హీరో హీరోయిన్లు ఇందులో వింత ఏముంది చాలా సందర్భాల్లో ఉండేటువంటిదే కదా మొట్టమొదటిసారి పాట ఏంటి నేను ఒకసారి మీకు వినిపిస్తాను ఏడుకొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ అనేటువంటి ఈ చరణం ఇది.
(02:39) నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ స్వామి నీ అనుగ్రహంతోనే నా జాతకం మారింది మా ఇద్దరిని ఒకటి చేశవు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు చెప్పుకున్న నీకు నా లవ్ మేటర్ దించుకున్నామయ్య పక్కా ఆన్సర్ నీ మాయ సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకో థాంక్యూ మై డియర్ కృతజ్ఞత చెప్పుకున్నారు నీ అనుగ్రహంతో మేము కలిసిపోయాము అని తర్వాత ఇక పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు ఇప్పుడు చెప్తున్నారు పెళ్లి కార్డులు వెయి ప్రింట్ చేశ ఫస్ట్ కార్డు నీకే పోస్ట్ చేశ గాటు రోడ్డు గట్టు దాటి వచ్చిపోరా వెంకటేశ ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేశ మొట్టమొదటి
(03:25) పేరు నీదే రాశ నువ్వు రాక డోలు బాజ మోగదంట వెంకటేశ ఈ చివరి రెండు లైన్లు హీరోయిన్ పాడుతుంది అన్నమాట మొదటి రెండు లైన్లు హీరో పాడతాడు. తర్వాత నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేశ అంటే అమ్మాయి అంటుంది విందులోకి తిరుపతి లడ్డు 100కేజీ బుక్ చేశ అన్నమయ్య పాటలతోటే ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశ నమో నమో వెంకటేశ ఒక లైన్ హీరో పాడతాడు ఒక లైన్ హీరోయిన్ పాడుతుంది.
(03:57) తర్వాత ఆ హనీమూన్ పోస్ట్పోన్ చేశ రానుపోను ట్రైన్ టికెట్ వేశ కొంగుముళ్ళు పడిపోని కొండకొస్తాం వెంకటేశ మేము హనీపోను క్యాన్సల్ చేసుకున్నాము ట్రైన్ టికెట్ కూడా తిరుపలకు మేము బుక్ చేసుకున్నాము మా కొంగుముళ్ళు పడ్డ తర్వాత ఈ కొండకొస్తాము స్వామి అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ అమ్మాయి హీరోయిన్ ఏమంటుంది పుట్టబోయే బాబు పేరు తెలుసా వెంకటేశ్వరు స్వామికి చెప్తుంది అన్నమాట స్వామి మాకు పుట్టబోయేటువంటి బాబు పేరు తెలుసా బాలాజీ లేదా శ్రీనివాస కన్నతండ్రి కంటే కన్నతండ్రి కంటి పాప రెండు నువ్వే వెంకటేశా ఇది హీరో హీరోయిన్లు చెప్పుకునేటువంటి పాట
(04:42) ఆ వెంకటేశ్వర స్వామి వారితో చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది లిరిక్స్ అంతా కూడా [గొంతు సవరించుకోవడం] భక్తి పారావశ్యంతోనే ఉన్నాయి కాస్త ట్రెండీగా ఉన్నప్పటికీ కూడా అందులో భక్తి కూడా ఉంది. సరే ఇప్పుడు ఇందులో నాకు వచ్చినటువంటి సమస్య ఏంటి అనింటే భక్తు భక్తుడు భగవంతుని ఉద్దేశి పాడుతున్నాడు.
(05:05) తమ విన్నపాన్ని స్వామికి చెప్తున్నారు. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంతో భక్తుడు తమ విన్నపాన్ని తెలియజేస్తుంటే ఎట్లా ఉండాలి సాంప్రదాయంగా ఉండాలి. మొహానికి బొట్టు కాస్త జుట్టు [గొంతు సవరించుకోవడం] వేసుకొని జడ వేసుకొని అందులో రెండు పూలు పెట్టుకొని చేతులకు గాజులు చక్కగా సాారీ కట్టుకొని అది భగవంతునికి విన్నపించుకోవచ్చు ఈ విధమైనటువంటి సాంప్రదాయంగా ఉండాలి భగవంతుడితో మనము మమేకం అవ్వాలి భగవంతునికి మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే గనుక భగవంతుడు మెచ్చేటువంటి విధంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఇందులో ఈ పాటలో హీరోయిన్ త్రిషా
(05:47) వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి పాడుతున్నంతసేపు కూడా తొడల వరకు మాత్రమే డ్రెస్ ఉంటుంది. నేను ఇంతకుమించి ఇంకేం మాట్లాడదు ఇంకా మీకు చెప్పను అంతవరకే డ్రెస్ మోడర్న్ డ్రెస్ అంతవరకు చేతిలోకి గాజులు ఇక తొడల వరకు మెడ్డి ఉన్నాక ఇక బొట్టు ఎందుకు ఉంటుంది గాజులు ఎందుకు ఉంటాయి కొప్పు ఎందుకు ఉంటుంది చెప్పండి ఇది ఎంత అసహ్యకరమైనటువంటి సన్నివేశము అసలు ఇది ఎంతమందికి హిందూ మనోభావాలు దెబ్బతిన్నది చెప్పండి ఇది అసలు ఇది సాంప్రదాయమేనా అసలు డైరెక్టర్ ఏ విధంగా ఆలోచించాడు ఈ పాటను క్రియేట్ చేసే సమయంలో ఈ కొరియోగ్రాఫర్ ఎవరో వాస్తవానికి కొరియోగ్రాఫర్ ఎక్కువ
(06:28) జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొరియోగ్రాఫర్ కి మెటీరియల్ అనేటువంటిది చాలా అవసరం. ఏ సన్నివేశంలో ఈ పాఠ ఉంది దానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ తయారు చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి డ్రెస్ కర్టసీ ఏ విధంగా ఉండాలి ఆర్టికల్స్ ఏమేమ ఉండాలి అనేటువంటివి అంతేకాకుండా గ్రూప్ డాన్సర్ల యొక్క డ్రెస్ కర్టసీ కూడా ఎట్లా ఉండాలి అనేటువంటిది అంతా కూడా కొరియోగ్రాఫర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
(06:55) మరి ఈ పాటకు కొరియోగ్రాఫర్ ఎవడో ఏంటో గాని నేను ఎట్లా చూసినా గాని ఆ వాడి పేరు రాలేదు ఇంత చండాలంగా ఒక భగవంతుని ఉద్దేశించి భక్తులు చేసేటువంటి విన్నపంలో ఉన్నటువంటి చండాలం ఇది ఈ దుర్మార్గాలు ఈ దరిద్రాలు అన్నీ కూడా మన హిందూ సాంప్రదాయంలోనే చోడ్ చేసుకుంటాయి. వేరే మతాల్లో ఇట్లాంటివి ఉండవు. 12 సుమారు ఒక 10 12 ఏళ్ళ అవుతుందేమో ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లల్లో ఎప్పుడు కూడా దీని మీద ఎలాంటి కాంట్రవర్సీ రాలేదు ఎవ్వరు కూడా ధర్ణాలు చేయలేదు ఎవరు వీడియోలు చేయలేదు ఇదఎవరు ఖండించలేదు నేను మొన్న చూశను గనుక చాలా విచిత్రం అనిపించి నేను వీడియో చేస్తున్నాను ఇన్నేళ్ల నుంచి
(07:37) ఎవ్వరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వలేరు అనింటే అది మన దరిద్రం మనం ఏది జరిగినా గాని మనము నోరు మెదపకుండా ఉంటాము మనము అన్ని మూ మూసుకొని కూర్చుంటాము అన్ని దరిద్రాలు మన హిందూ సాంప్రదాయంలోని జరుగుతూ ఉంటాయి. ఇతర మతాల్లో ఇలాంటివి ఏవైనా గాని జరిగితే ఒక్క పూట ఆట కూడా ఆ సినిమా ఆడదు. అది మన దౌర్భాగ్యం. ఇది ఈ సినిమా నమో వెంకటేష్కి సంబంధించినటువంటి ఈ పాట గురించినటువంటి నా అభిప్రాయము అయితే ఇదే సందర్భంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి.
(08:12) ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు చూడండి ఏ తెలుగు సినిమా మీరు చూసినప్పటికీ కూడా ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ పెట్టారనుకోండి అవి సినిమా అవి ఫైటింగ్ సీన్స్ అన్నీ కూడా దేవాలయంలో దేవాలయం లోపల దేవాలయంలో ఒక హోమగుండం వేస్తూ ఆ హోమగుండం దగ్గర దేవాలయము సరిగ్గా ఆ ముఖ మండపానికి ఎదురుగా ఫైట్ సీన్స్ అన్నీ కూడా అంటే అంటే ఈ ఫైట్ సీన్స్ అనేటువంటివి దేవాలయంలో నిర్వహించకూడదా ఆ దేవుడు చెడుపైన మంచికి విజయంగా సంకేతంగా భావించుకోవచ్చు కదా అనిఅంటే భావించుకోవచ్చు కానీ ఏదో ఒక సందర్భంలో జరిగింది అని అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ ప్రతి సినిమా
(08:58) సినిమాలో ఫైటింగ్ ఈ దేవాలయం దగ్గరనే దేవాలయం సెటప్ లేదా దేవాలయం ఎదురుంగా ఒక అమ్మవారి బొమ్మ అమ్మవారి ముందు ఇలాంటి సన్నివేశాలు ఈ ఈ ఫైటింగ్ సీన్స్ అన్నమాట అక్కడ చెప్పులు బూట్లు అన్నీ వేసుకొని ఆ ఫైటింగ్ సన్నివేశాలన్నీ కూడా ఉంటాయి కుంకుమను తంతారు పసుపును తంతారు పువ్వులను తంతారు పళ్ళను దంతారు ఆ అవే బూట్లు చెప్పులు వేసుకొని ముఖ మండపం మీదకి వెళ్తారు ధ్వజస్తంభం మీద పడతారు విగ్రహాల మీద పడతారు ఇట్లాంటి సన్నివేశాలు ఈ ఫైటింగ్ సీన్స్ అనేటువంటివి మన హిందూ దేవాలయాల్లో మాత్రమే జరుగుతాయి మసీదులు లాంటి వాటిలో చేస్తే వాటి
(09:44) పర్యవసనం వేరేగానే ఉంటుంది. ఫైటింగ్ మాత్రమే కాదు మిత్రులారా రొమాన్స్ శృంగారం కూడా మన ఈ ఆలయాల్లోనే మన దౌర్భాగ్యం ముద్దు పెట్టుకునేటువంటి సీన్లు హీరోయిన్ని కౌగోలించుకునేటువంటి సీన్లు హీరోయిన్ సైట్ కొట్టేటువంటి సీన్లు ఈ దౌర్భాగ్యాలు దేవుని ఎదురుగా కౌగలించుకోవడము ముద్దు పెట్టుకోవడము నడుమునకు వెళ్ళడము ఈ దరిద్రాలన్నీ కూడా ఆలయంలో చేస్తారు.
(10:18) అసలు ఆలయానికి ఈ రొమాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఆలయం అనేటువంటివి పవిత్రమైనటువంటి క్షేత్రాలు అంటే మిగతా మన ఆలయాలు మాత్రము యుద్ధ సన్నివేశాలు కొట్లాటలకు సన్నివేశాలు రొమాన్స్ కు సన్నివేశాలకు మన ఆలయాలు పనికొస్తాయి. ఇతరులవి ఏవి కూడా అవన్నీ కూడా శాంతికి కపోతాలు అవన్నీ కూడా శాంతికి సంకేతాలు శాంతి చిన్హాలు అవన్నీ కూడా అక్కడ ఇట్లాంటివి పనికి రావు ఎందుకంటే అవన్నీ శాంతి సంకేతాలు శాంతి చిన్హాలు హిందూ ఆలయాలు శాంతి చిన్హాలు కావు శాంతికి సంకేతాలు కావు ఆలయాలు అని అంటే టైం పాస్ చేసేటువంటివి డైరెక్టర్లే చెప్తున్నారు ఆలయాలు రొమాన్స్ చేసుకోవడానికి ఆలయాలు
(11:02) కొట్లాడుకోవడానికి ఎందుకంటే మనం చాలా మంది అలాగే ఇస్తాం ఆలయాలకు మనం వెళ్ళామ అనుకోండి లైన్ లో ఉంటే కూడా వెనక ఉన్నవాడు వాడు ముందు ఉన్నాడు వాడిని లైన్ లో ఉన్నసేపు తిట్టుకుంటూనే ఉంటారు. కొంతమంది అయితే కొట్లాడుకునే సందర్భాలు కొన్నిసార్లు ప్రాణాలు పోయినట్టు సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చేశం. ఇవన్నీ జరుగుతున్నవే గనుక డైరెక్టర్లు ఒక స్టెప్ ఒక 10 స్టెప్ 10 అడుగులు ముందుకు వేసి ఇంతకంటే జుగుప్సాకరమైన సన్నివేశాలు తీశరు కానీ ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు ఆలయాలు అనేటువంటివి ఇట్లాంటి దరిద్రాలకు కేర్ ఆఫ్ కానే కాదు ఆలయాలు పవిత్రమైనటువంటి చిన్హాలు ఆలయాలు ఇంకా
(11:41) సినిమా సంబంధించినటువంటివి ఇంకేవైనా తీసుకోవచ్చు గాక సినిమాలో ఆలయాలు అంటే ఫైటింగ్ సన్నివేశాలు రొమాన్స్ సన్నివేశాలు కామెడీ చేయడానికి అనేటువంటివి ఆలయాల్లో చేయడానికి అసలు హిందువులు ఎవరు కూడా ఒప్పుకోవద్దు. అట్లాంటి సన్నివేశాలు ఉంటే ఖచ్చితంగా బైకాట్ చేయాలి అప్పుడే మన ధర్మానికి ఏమైనా గాని వాల్యూ పెరుగుతుంది ఇతర ధర్మాల వారు కూడా అప్పుడు గొప్పగా కీర్తించే అవకాశాలు ఉంటుంది ఇది నా అభిప్రాయము ఈ వీడియో ఏ సినిమా డైరెక్టర్ కైనా గాని చేరితే బాగుండు ఎవరైనా వీడియో చూసేటువంటి వారు నా ఆవేదనను నా అభిప్రాయాన్ని ఎవరైనా సినిమా దర్శక
(12:24) నిర్మాతలకు లేదా హీరో హీరోయిన్లకు వారికి చేరవేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా మనవి ఇది ఆ నేను అనుకున్నటువంటి వీడియో మీద నేను ఇచ్చేటువంటి క్లారిటీ మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహ బలం గృహ బలం ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి.
(12:55) జై హింద్ జై భారత్ వందేమాతరం నమస్కారం.

No comments:

Post a Comment