Sunday, August 2, 2026

 కష్టనష్టాలు సంభవించినప్పుడు దైవాన్ని దూషించటం సుఖసంతోషాలు కలిగినప్పుడు దైవాన్ని గొప్పగా వర్ణించటం అల్ప బుద్ధుల లక్ష్యం. సుఖదుఃఖాలను సమత్వంతో స్వీకరించగలిగే ప్రేమ తత్వాన్ని పొందాలి. అందరిలో ఉన్న ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి దీనికి ఒక చక్కని ఉదాహరణ.

మన దేహంలో అనేక అంగాలు ఉంటాయి. ఏ అంగానికి బాధ కలిగినప్పటికీ దేహమంతా ఆ బాధకి గురి అవుతుంది. మనకు కాలునొప్పి వస్తే అయ్యో పాపం నా కాలు బాధపడుతుందే అని అనుకోం కదా. ఆ కాలు మనదే కాబట్టి ఆ బాధను మనమే అనుభవిస్తుంటాం. 

అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఎవరికైనా మన సహాయపడినప్పుడు ఎవరికో సహాయ పడుతున్నామని అనుకోకూడదు. అది మనకు మనం సహాయం చేసుకోవటమే మన బాధను మనమే నివారించుకోటమే. మనలోనూ ఇతరులను ఉన్న దివ్యత్వం ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు ఇలాంటి భేదాలకు ఏ మాత్రం అవకాశం ఉండదు.

No comments:

Post a Comment