Monday, July 12, 2021

మనస్సు - కోరిక.

🌸 మనస్సు - కోరిక. 🌸

🌸 మనసేప్పుడు తనకు అంటే ఇంద్రియాలకు నచ్చనిది వ్యతిరేకిస్తుంది.. అన్నింటినీ అంగీకరించేలా చేయటం ఇంద్రియాలకు తద్వారా మనసుకు మొదట శిక్ష... కొంత కాలం తర్వాత ఆ శిక్ష శిక్షణగా మారిపోతుంది... తరువాత మనసే అన్ని చూసుకునే దక్షత కలిగి ఇంద్రియాలకు తద్వారా రక్ష అవుతూ పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే మాస్టర్ లేదా సెల్ఫ్ గా రూపాంతరం చెందుతుంది..

🌸 మొదట మనస్సు ధ్యానం చెయ్యటానికి ఒప్పుకోదు.. కానీ ధ్యానానికి కూర్చున్నప్పుడు మనలోని భయాలను బయటకు తీసి చూపుతూ ఇలా ఉండలేను అని గట్టిగా చెబుతుంది... ఇలా కూర్చుంటే ఇది నాకు శిక్ష అని అరుస్తుంది కూడా... అదే ఒక మండలము పూర్తి చేస్తే... ఆ సమయానికి చక్కగా రెడీ అయిపోతుంది... అంటే ధ్యానాన్ని శిక్షణ గా మార్చుకొన్నది...

🌸 శిక్షణ జరుగుతున్నంత కాలం రోజువారి కార్యక్రమాలు ఏది ఎలా చేస్తే ఎలా ఉంటుందో
చక్కగా గైడ్ చేస్తూ సమస్యలను ధుది పి0జలుగా మార్చేస్తూ తదుపరి పరిణామాలకు రెడీ చేస్తుంది..
అంటే మనల్ని ఒకరంగా పరిధిలో నుంచి బయటకు తీసుకెళుతుంది.. ఎప్పుడైతే బయట పరిధిలోకి తీసుకెళుతుందో అక్కడ నుంచి మన అసలు ప్రయాణం మొదలు..

🌸 ఇక్కడ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ మనలోని జ్ఞానానికి పదును పెడుతూ... మనలోని కోరికలను నెరవేర్చే దారిచూస్తూ ఉంటుంది...
కోరికలు సరైనవ కాదా అనేది మనసుకు ముఖ్యం కాదు...
మనసుకు సంబంధించినంత వరకు అనుభూతి ముఖ్యం..
అనుభూతుల కొఱకు నిత్యం సంసిద్ధంగా ఉంటుంది... కోరికలు వచ్చేది మనసు నుండే.. పొందేది కూడా మనసే.. ఎన్ని సార్లు తరచి చూసిన కోరికకు మూలం మనస్సు... నెరవేర్చుకునే దారి వేదికేది మనస్సే.. పొందేది మనస్సే... కోరికలు నెరవేరకపోతే కొలిమిగా మారేది మనస్సే. ఆ కొలిమిలో కోరికలను కాల్చి కవచాలుగా మార్చేది మనస్సే..
అదే మనస్సు కోరికల మూలానికి తీసుకెళ్లి జీవితం ఒక లీల అని చుబించేది మనస్సే... మనస్సే సెల్ఫ్ మారుతూ మనల్ని పూర్తిగా సంరక్షించే పనిలో ఉంటుంది దేనికొఱకు అంటే మనసు ఇంతపని చేస్తుంది అంటే మనసు ద్వారా ఆత్మ చేసే ప్రయాణం అని అర్ధమౌతుంది..

🌸 మనసును మనo ఎలా దర్శింస్తున్నామో చూస్తే అంత తేట తెల్లం.. మనకు మనస్సు నేను గా కనబడుతుంది అన్ని చోట్లా.. నేను నిద్రావస్థలో ఉంటే అజ్ఞానం మెలకువలో ఉంటే జ్ఞానం..
అంటే మనం అన్ని నేను ద్వారానే దర్శిస్తాము... నేనే ఆత్మ, మనసు.. ఇంకేమి ఉన్న మనం చూసేది అర్ధం చేసుకునేది నేనుద్వారానే.. వ్యక్తపరిచేది నేను ద్వారా..
పొందుపరచేది నేనే... ఇదే అందరిలో ఉన్నది... అందర్నీ కలిపేది నేనే...

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment