సోమవారం --: 01-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాటలుఒక బంధం బాగుండాలి అంటే ఒకరిమాట మరోకరు గౌరవించాలి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది బంధం బలపడాలన్నా బలహీన పడాలన్న మాటలే కారణం అవుతాయి , మాటకంటే బంధం విలువైనది నేస్తమా !
ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టినవారిని , అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని ఆపదలో ఉన్నప్పుడు రక్షించిన వారిని మరిచిపోయిన మనిషి బతికి ఉన్నా చచ్చనట్టే .
మిత్రమా ! మనం జీవితంలో అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి మనకుంటే చాలు మనం కోల్పోయిన వాటిన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు .
మనతో రోజు మంచిగా మాట్లాడేవారందరు మంచివారేమి కాదు ,కొందరు మాత్రమే మంచితనం ఉన్నవారు ఉంటారు,,నమ్మకాన్ని అవసరానికి వాడుకుని ఏదో ఒక్కరోజు వాళ్ళు బుద్ధి చూపిస్తారు .
నీ కోసం నీ జీవితం కోసం నీ కన్నా ఎక్కువ గా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు,,, ఎవరో ఒకరుతప్పక ఉంటారు . నువ్వు వారికి ఏదో చెయ్యాలని ఆశించరు నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాడమే .
మనం ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానంలో ఉంటాము . మనం ఎదుటి వారికి ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం మనకుంటుంది , మనం ఎదుటి వారినీ ఎంత తక్కువ ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి మనకు ఉంటుంది . మనం ఎదుటి వారిపై ఎంత తక్కువ ఆశ పడతమో అంత ప్రశాంతత ఉంటుంది . మనం ఎదుటి వారితో ఎంత తక్కువ మాట్లాడుతమో అంత విలువ మనకు ఉంటుంది .
సేకరణ ✒️ AVB* సుబ్బారావు ,9985255805
💐🕉️🤝🌹🌷
No comments:
Post a Comment