🙏 🙊🙈🙉 🙏
జీవిత సత్యం
మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలోనే ఉంటున్నాం కాబట్టి,అజ్ఞానంలో
పెరుగుతున్నాం కాబట్టి
భగవంతుడు మూగవాడు అంటే ఏమో అనుకోవచ్చు,చేవిటివాడు అన్నా సరేలే అనుకోవచ్చు ఇంకా కుంటివాడు అన్నా నిజమే కావచ్చేమో అనుకోవచ్చు.
కానీ భగవంతుడు గుడ్డివాడు అంటేనే నమ్మబుద్ధి కావడంలేదు.
అదే నిజం అయితే మనం నిద్రపోయేపుడు శ్వాస తీసుకునేట్టు చేస్తున్నాడు
తిన్నది చక్కగా జీర్ణం చేస్తున్నాడు పైగా పొద్దునే అన్ లోడింగుకు ఆర్డర్
వేస్తున్నాడు ఇవన్నీ మనకు తెలియకుండానే మనతో చేపిస్తున్నాడు.
దీన్నిబట్టి మనమేదో పొరపాటు పడుతున్నాం అనిపిస్తుంది
కాస్తా ఆలోచిస్తే పోయేదేముంది
అనారోగ్యం తప్ప.
ఈ రోజు అదేనండీ అక్టోబర్ నెల రెండో తారీకు గాంధీ గారు మనందరి తాతగారు పుట్టినరోజు కదా
ఆయన అంటే మనకే కాకుండా ఈ ప్రపంచం అంతా గౌరవమే కదా చివరికి ఆయనను కాల్చిన గాడ్సే కూడా ఏడ్చాడు కదా కానీ మనం.
ఆయన హింస వద్దంటే వినడం లేదు
అహింసా పరమో ధర్మః అంటే అర్థం చేసుకోవడం లేదు
మాంసాహారం వద్దంటే మానడం లేదు
నిరాడంబరం అంటే నచ్చడం లేదు
అప్పుచేసి అయినా సరే ఆదివారం ఆ కూర
అల్లుడు వస్తె ఈ కూర
పండగ వస్తె ఆ కూర ఈ కూర అవునా కాదా చెప్పండి
కాదంటే మన్నించండి
అవునంటే ఆలోచించండి.
ఆ పరమాత్ముడేమో
తస్మాత్ యోగీ భవ అన్నాడు
అంటే ధ్యానం చేయమనేగా
అదీ సరిగా అర్దం అయినట్టు లేదు
అరగంట హాయిగా కళ్ళు మూసుకుని కూర్చో మంటే వినం
ముగ్గురు నలుగురు కలిస్తే చాలు ఆ C M అలా ఈ C M ఇలా ఇంకా ఆ పై P M ఇంకోలా మనకెందుకండి ఆ గోల ఆ రోజు వస్తె ఎవరు ఎక్కడుండాలో అక్కడ వుంచు తాడు ఆ పైన వున్నవాడు.
ఆయన పనే అది గదా
పైగా ఆయన గుడ్డివాడు కాదని కదా మన నమ్మకం.
ఎవరు ఎక్కడుండాలన్నా మనకేం కావాలన్నా
తాత గారు చెప్పినట్టు అహింస
శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా
శ్వాస మీద ధ్యాస ధ్యానం అంతే అండి
శ్రమ లేదు
కర్చు లేదు
ఏ నియమం లేదు
ఈ రోజే మొదలు పెడదాం.
ఎంత మంచి రోజో కదా
అర్దం అయివుంటుంది
గాంధీ తాత పుట్టిన రోజు
ఆదివారం
రేపు దుర్గాష్టమి
ఎల్లుండి మహనవమి
తర్వాత విజయదశమి
పండగే పండగ
అందరికీ ఇల్లంతా
నిండుగా
సందడిగా
అదీ సంగతి నమస్తే నమస్తే నమస్తే నమః ఓం 🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment