మానవ జన్మయందు "30" లక్షణములను తప్పక పొందవలసియున్నది తద్వారా మనుజుడు భగవంతుని ప్రసన్నుని (సంతృప్తి) కావించగలడు
1. సత్యసంధత
2. దయ
3. తపస్సు
4. రోజుకు రెండుమార్లు స్నానము చేయుట.
5. ఓర్పు
6. మంచి-చెడు విచక్షణ
7. మనో నిగ్రహము
8. ఇంద్రియనిగ్రహము
9. అహింస
10. బ్రహ్మచర్యము
11. దానము
12. శాస్త్రాధ్యయనము
13. సరళత
14. సంతోషము
15. సాధుమహాత్ముల సేవ
16. అనవసరమగు
వ్యాపకములను నెమ్మదిగా వదిలి పెట్టుట
17. మానవసమాజము నందలి అనవసర కార్యముల యొక్క వ్యర్థతను పరిశీలించుట.
18. మౌనముగా గంభీరముగా నుండుట
19. వ్యర్ధప్రసంగమును వీడుట
20. ఆత్మానాత్మ వివేకము
21. జీవులందరకు ఆహారము సమానముగా ఒసగుట
22. ప్రతి జీవుని భగవదంశగా చూచుట
23. భగవానుని కర్మలను,
ఉపదేశములను ఆలకించుట,వాటిని కీర్తించుట
24. స్మరించుట
25. సేవ
26. అర్చనము
27. వందనము
28. దాస్యము
29. సఖ్యము
30. ఆత్మనివేదనములనెడి ధర్మములు మానవులు అనుసరించవలసినవి
- భాగవతము 7.11.8-12 (నారదముని ధర్మరాజుకు చేసిన బోధ.
సర్వేజనాసుఖినో భవంతు
శుభమస్తు
No comments:
Post a Comment