నీ మంచితనం గురించి,
ఇతరులకు చెప్పకు,
కారణం...వారు నమ్మరు,
నీ చెడును మరొకరికి తెలుపకు,
కారణం...దానికి మరికొంత జోడించి ఊహించుకుంటారు.!
జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం,
హాయిగానే ఉంటుంది..కానీ,
జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు,
వాటిని మనకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకున్నప్పుడే,
మనమంటే ఎవరని అందరికీ తెలుస్తుంది.!!
నీ మనసులో ఏముందో,
దాన్ని వ్యక్తపరిచే ధైర్యాన్ని పెంచుకో...!
ఇతరుల మనసులో ఏముందో,
వారు తెలపకుండానే,
గ్రహించగలిగే సామర్ధ్యాన్ని...పెంపొందించుకో..!!
ఈ ప్రపంచం నువ్వు ఎలా బ్రతుకుతున్నావని,
ఏ నాడు చూడదు...!
ఆడికన్నా తగ్గి బ్రతుకుతున్నావా? లేదా అన్నది మాత్రమే చూస్తుంది.!!
రిలేషన్ షిప్స్...సగం ఈ కాన్సెప్ట్ మీదనే బేసై ఉంటాయ్.!
మీరు ఎవరినీ ఆకట్టుకోవాల్సిన,
అవసరం లేని స్థితికి వచ్చినప్పుడు,
మీ స్వేచ్ఛ🕊️ ప్రారంభమవుతుంది...☝
No comments:
Post a Comment