Wednesday, November 2, 2022

దగ్గు ayurvedic remedies

 ..
నాలుగు తమలపాకులు తొడిమలు తీసేసి రెండు పెద్దఉప్పురాల్లు కొంచెము వాము తమలపాకులో. పెట్టి కచ్చపచగ్గా నమిలి బుగ్గన పెట్టుకొని రసము  రోజుకి 3 సార్లు మింగుతూ వున్న  తగ్గును

*తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా దగ్గును తగ్గించుకోవచ్చు.
*పసుపు పాలు గోరు వెచ్చగా రోజు రెండు సార్లు తాగితే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
*దగ్గు తీవ్రంగా ఉంటే తిప్ప తీగ మంచి ఔషధం. 2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి దగ్గు తగ్గేవరకూ ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఎంత తీవ్రమైన దగ్గు అయినా తగ్గుతుంది.
* దగ్గు కోసం మరొక ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కా తేనె , యష్టిమధురం ,దాల్చినచెక్క.. వీటి పొడిని సమపాళ్లలో తీసుని నీటిలో కలుపుకుని రోజుకి రెండు సార్లు పొద్దున, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*ఆగకుండా దగ్గు వేధిస్తుంటే.. మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో దేశీయ ఆవు నెయ్యితో కలుపుని ఈ మిశ్రమాన్ని ఏదైనా తిన్న తర్వాత తీసుకోవాలి.
*పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడిని కలిపి ఇస్తే మంచి ఫలితం ఉపశమనం ఇస్తుంది.
* వేడి వేడి మసాలా టీ, దగ్గుని సహజంగా తగ్గిస్తుంది. అర చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలు టీకి జత చేసి వేడిగా టీ తాగితే దగ్గు తగ్గుతుంది.
సర్వసాధారణంగా దగ్గు రాత్రి సమయంలో అధికంగా వస్తుంది. కనుక దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే తలని కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకుని నిద్రపోతే దగ్గు తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.


No comments:

Post a Comment