Friday, November 4, 2022

శరీరపరమైన విధులను, మనో సంబంధ కదలికలను ఎలా సమన్వయం చేయాలి ?

 💖💖💖
         💖💖 ** 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"శరీరపరమైన విధులను, మనో సంబంధ కదలికలను ఎలా సమన్వయం చేయాలి ?"*
               **

*"బావిలో మునిగిన బొక్కెన బావి నీళ్లను బొక్కెనలోని నీళ్లను వేరు చేసినట్లు, అనంత స్పృహను ఈదేహం పరిమితస్పృహగా మారుస్తుంది. స్పృహనే 'ప్రజ్ఞ-ఎరుక-తెలివి-చైతన్యం' అని వ్యవహరిస్తాం. అదే మన అసలు స్వరూపం. కానీ అది దేహం ద్వారా వ్యక్తమై ఈదేహమే నేనూ అన్న భావన కలిగిస్తుంది. అద్దంలో ప్రతిబింబాన్ని చూసేప్పుడు కూడా అందులో కనిపించేది మనమే అని భ్రమిస్తుంటాం. శరీర గతమైన విధిని అనుభవిస్తూ మనసును మాత్రం అంతరంగంగా ఉన్న దైవంపై లక్ష్యం చేయడం ద్వారా సాధనా ఫలాన్ని పొందే వీలవుతుంది. అంటే కార్యకారణాల్లో తన కదలికకు గల కారణాన్ని అన్వేషించేందుకు పూనుకోవాలి. పుష్పం నుండి దాని సుగంధాన్ని వేరు చేయలేనట్లే, ఈదేహానికి గల  ప్రారబ్ధాన్ని వేరు చేయలేము. కానీ మనసుకు దాని వికారాలు సోకకుండా సాధన కొనసాగించవచ్చు. 'దైవంపై' నిమగ్నమైన మనసు మోక్షాన్ని, 'దేహంపై' నిమగ్నమైన మనసు బంధాన్ని మిగుల్చుతుంది. దైవం మనలో ఉండి చేసే అనేక పనులను గుర్తించగలిగితే కృతజ్ఞత పెరిగి శరణాగతి సిద్ధిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             🌼💖🌼💖🌼
                   🌼🕉🌼

No comments:

Post a Comment