Friday, November 4, 2022

జీవితం - ఆనందమయం - ఎలా అవుతుంది??

 *జీవితం - ఆనందమయం - ఎలా అవుతుంది??*

మానవుడు ఎన్ని రకముల బాహ్యమైన పూజలు చేసిననూ హృదయమును శుద్ధి చేసుకోనిదే సత్పురుషుడు కాలేడు...
తనలోని చెడు గుణములను పూర్తిగా తొలగించుకొనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము ఉండదు...

నల్లని బొగ్గు అగ్నితో చేరినప్పుడు ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది, 
అదేవిధముగా మానవుని హృదయములో చేరిన దుర్గుణములను తొలగించుకొనుటకు సత్పురుషుల సాంగత్యము చాలా అవసరము...

సత్సంగము వలన మానవుడు సంస్కరింపబడి సత్పురుషునిగా మారగలడు, ఎవరు నిత్యమూ సత్సంగములో గడుపుదురో వారు  నిత్యమూ ప్రశాంతతో ఉంటారు. 
చింత అనేది వారి చెంతకు దరిచేరనే చేరదు, ఇట్టివారి జీవనము ఆనంద నిలయం అవుతుంది...

        

No comments:

Post a Comment