మన ఆలోచనలు🫧....
వేటిని ప్రభావితం🌊 చేస్తాయి?!
భగవంతుని✴️ యొక్క సర్వ🌊 శక్తులు🌈⚡⛈️ స్వయంపై సదా వర్శిస్తున్నట్లు అనుభవం చేస్తూ, తన సర్వ శక్తులను స్వయంలో నింపుకుంటూ, తర్వాత వాటిని మన కుటుంబ సభ్యులకు మాత్రమే కాక, సమస్త సృష్టికి కూడా రేడియేట్ చేస్తూ ఉండాలి.
నేడు అనేకులు దుఃఖంలో ఉన్నారు, అనేకులు శారీరక అనారోగ్యానికి గురై బాధపడుతున్నారు, అనేకుల జీవితాలలో కష్టాలు చోటుచేసుకుని ఉన్నాయి. వారందరికీ భగవంతుని శక్తులతో కూడిన వైబ్రేషన్స్ ని రేడియేట్ చేయాలి.
మనం చేసే ప్రతీ ఆలోచన నాలుగు చోట్ల ప్రభావాన్ని వేస్తుంది.
ఏదైతే మనం ఆలోచన చేస్తామో దాని యొక్క మొదటి ప్రభావం మన మనస్సుపై ఉంటుంది. అదే అనుభూతిలోకి వస్తుంది. తర్వాత, ఆ ఆలోచన మన శరీరానికి రేడియేట్ అవుతుంది. కనుక, రెండవ ప్రభావం మన శరీరంపై తద్వారా మన ఆరోగ్యంపై పడుతుంది. మూడవ ప్రభావం... ఆ ఆలోచన ఎవరి కోసం అయితే చేస్తున్నామో వారిని చేరి వారిపై పడుతుంది. నాలుగవ ప్రభావం విశ్వంపై ఉంటుంది. మనం చేసే ప్రతీ ఆలోచన యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో రేడియేట్ అవుతాయి.
నేడు మన సృష్టి యొక్క స్థితి ఏదైతే ఉందో... అది మన మనస్సు యొక్క స్థితి ప్రభావంతో ఏర్పడినదే!
🕉️💓ఓం..🕉️💓ఓం..🕉️💓ఓం..🕉️💓ఓం..🕉️💓ఓం..
No comments:
Post a Comment