🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"384"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"జపం, ధ్యానం, ఆత్మదర్శనం వీటిని ఎలా స్వీకరించాలి/సాధించాలి ?""*
*"భాగవన్నామాన్ని స్మరించటాన్ని 'జపం' అంటారు. ఇతర ఆలోచనలేవీ లేనంతగా ఆ జపం కొనసాగితే దాన్ని 'ఆత్మదర్శనం' లేదా 'దైవదర్శనం' అంటారు. పడుకునేముందు నోటిలో లవంగం వేసుకుంటే నిద్రించేప్పుడు అది ఉన్నట్లు మనకి తెలియకపోయినా, నిద్ర లేచేసారికే అది మన నోట్లోనే ఉంటుంది. రాత్రంతా నోట్లోనే అది నానింది. అలాగే మంత్రాన్ని జపిస్తూ నిద్రిస్తే రాత్రంతా మనసు ఆ మంత్రంతో నానుతుంది. మళ్ళీ నిద్రలేచే సమయానికి ఆ మంత్రంతోనే నిద్ర నుండి మేల్కొంటుంది. మనసుకు ఉన్న అవకాశాన్ని గమనించటమే సాధన అని 'జిళ్లేళ్ళమూడి అమ్మ'వారు చెప్పిన కిటుకును అర్ధంచేసుకొని సాధన సులభతరం చేసుకోవాలి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment