💖💖💖
💖💖 *"378"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసు మంత్రంగా ఎలా మారుతుంది ?"*
***************************
*"మనం జాగృతిలో ఉండగా వచ్చే అనేక భౌతిక విషయాలకు సంబంధించిన ఆలోచనలను వదిలేందుకు మంత్రాన్ని ఆశ్రయిస్తాం. మనసు ఇతర ఆలోచనలతో కలిసి మంత్రాన్ని మననంచేసే స్థితిని 'మంత్రజపం' అంటాం. తదేకంగా మంత్ర జపాన్ని కొనసాగించటంవల్ల మనసు ఈ మంత్రాన్ని మాత్రమే మననంచేస్తూ ఇతర ఆలోచనలన్నింటినీ వదిలేస్తుంది. అప్పుడు మనసు పూర్తిగా మనంచేసే మంత్రంతో నిండిపోయి ఉంటుంది. అలా మనసు ఒకే విషయంలో మమేకమై ఉండే స్థితిని ధ్యానం అని అంటాం. అదే శ్రద్ధతో మననం కొనసాగిస్తే మనసులో నిండిన ఆ మంత్రం మనసులోనే లీనమై మాయమైపోతుంది. అంటే మనసే ఆ మంత్రంగా మారిపోతుంది. దాన్నే 'సమాధిస్థితి' అంటారు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment