*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴 మనిషి అనేవాడు లోహపు బిందెలా ఉండాలి. లోహపు బిందెకు ఉన్న సొట్టను సరిచేయగలం. కానీ మట్టి పాత్రకున్న సొట్ట సరిచేయలని చూస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది. సరిగ్గా కొందరి విషయాల్లో ఇదే జరుగుతుంది. ఎన్ని మంచి మాటలు చెప్పినా కొంతమందిని మార్చలేం. వీళ్ళ అజ్ఞానము, అహంకారము మూలానా వీళ్ళు మంచివైపుకు తిరగడానికి ఆసక్తి చూపరు! అయితే ఇప్పుడు కాకున్నా ఏదో ఒక రోజు తమ తప్పును తెలుసుకుంటారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తదుపరి ఎవరు వచ్చినా నష్టాన్ని భర్తీ చేయలేరు. కనుక మారడానికి సిద్ధంగా ఉండాలి. చెడు నుండి మంచి వైపుకు, నాస్తికత్వం నుండి ఆస్తికత్వం వైపుకు, అఙ్ఞానము నుండి జ్ఞానం వైపుకు మారాలి. మంచి మాటలను, మంచి మార్గాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేశామా, తరువాత పురాతన తవ్వకాలు జరిపినా కూడా వాటి జాడ కనుగొనలేం!.🌴_*
No comments:
Post a Comment