X6. X. 1-5. 291022-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నమ్ముకుని వచ్చిన వారిని
వదిలివెయ్యరాదు!
➖➖➖✍️
భగవాన్ శ్రీకృష్ణుని అవతారలీల సమాప్తం అయిందన్న వార్త ధర్మరాజుకు చేరింది
యాదవులు పరస్పరం కలహించు కోవడంతో వంశ నాశనం అయిందని కూడా తెలియ వచ్చింది
ఆయన నిర్విణ్ణుడయ్యాడు
తదుపరి తన కర్తవ్యాన్ని నిర్ణయించు కున్నాడు
అర్జునుని మనుమడైన పరీక్షిత్తుకు రాజ్యానికి - భిషేకం చేశాడు
ధర్మరాజు తను ధరించిన అమూల్యమైన ఆభరణాలను. అతివిలువైన రాజోచిత వస్త్రాలను త్యజించాడు.
అతిసామాన్యమైన దుస్తులు ధరించాడు
శిరోజాలను విప్పి వీర సన్యాసం పుచ్చుకొని ఉత్తరదిశగా బయలుదేరాడు
ఆయనతోపాటు తక్కిన పాండవులు. భార్య ద్రౌపది కూడా బయలుదేరారు
ధర్మరాజు మాయామోహాలకు అతీతుడయ్యాడు
ఉపవాస వ్రతం చేగొన్నాడు
దారి మధ్యలో ఎక్కడా బస చేసి విశ్రమించలేదు
ఎక్కడా ఆగకుండా ఏ వైపు తిరిగి చూడకుండా తిన్నగా పయనిస్తూనే ఉన్నాడు.
అలా పయనిస్తూ మహోన్నత హిమాలయాను చేరుకున్నాడు
బద్రీనాథ్ క్షేత్రాన్ని గమనించాడు
ఆయనతో వచ్చిన సోదరులు, ద్రౌపది కూడా అట్లే ధర్మరాజు అడుగుజాడల్లోనే నడిచి వస్తున్నారు.
అంతవరకు ధర్మరాజు నడిచి వచ్చిన భూమార్గం అంతరించింది
స్వర్గలోకానికి వెళ్లే పుణ్యభూమిని అప్పుడు ఆయన చేరుకున్నాడు
అక్కడకు చేరుకోగానే మొదట ద్రౌపది తరువాత నకుల సహదేవులు తదనంతరం అర్జునుడు. వరుస క్రమంలో నేలకూలసాగారు.
వాళ్లు అక్కడే పడి ఉండి - పోయారు.
ఆ మంచు ప్రాంతంలో నేల కూలగానే
వారిని లేపడానికి చేసే ప్రయత్నం వృధా
నేలకొరిగిన మరుక్షణమే మంచు వారి దేహాలను ఆవరించి సమాధి చేసివేస్తుంది.
అతిపవిత్రమైన ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయేవారు నిశ్చలంగా స్వర్గలోకాన్ని ప్రాప్తించుకుంటారు! వారిని అడ్డగించడం ఎవరికీ సాధ్యం కాదు.
యుధిష్ఠిరుడు పైపైకి నడిచిపోతున్నాడు
ఆయన ఆగలేదు
నేలకొరిగినవారి వంక తిరిగి చూడనూలేదు.
ఆయన ఇష్టానిష్టాలకు అతీతుడయ్యాడు.
చివరికి భీముడు కూడా పడిపోయాడు
ఇంతలో యుధిష్ఠిరుడు స్వర్గానికి దారితీసే మార్గమైన సమున్నత శిఖరాన్ని చేరుకున్నాడు.
అప్పటికి మార్గమధ్యలో ద్రౌపది, సోదరులు నేలకొరిగిపోవడం జరిగింది
కాని ఒక కుక్క మాత్రం ఆయనతో వస్తూనే ఉంది.
అది హస్తినాపురం నుండి వారి వెంట వస్తోంది.
యుధిష్ఠిరుడు ఆ సమున్నత శిఖరాగ్రన్ని అధిరోహించిన మరుక్షణమే ఇంద్రుడు తన విమానంలో అక్కడకొచ్చి దిగాడు.
యుధిష్ఠిరుని చూడగానే మహదానందంతో దేవేంద్రుడు ఆయనను అప్యాయంగా ఆహ్వానించాడు.
“మీ ధర్మాచరణ ఫలితంగా నేడు స్వర్గం యావత్తు మీకు చెందుతుంది రండి విమానం అధిరోహించండి!”అంటూ మందస్మితవదనుడై ఆహ్వానించాడు.
అప్పుడు యుధిష్ఠిరుడు తన సోదరులను భార్య ద్రౌపదిని కూడా స్వర్గంలోకి ఆహ్వానించమని దేవేంద్రుని వేడుకున్నాడు.
అందుకు దేవేంద్రుడు… “వారు ఇప్పటికే స్వర్గంలో ఉన్నారు!" అని చెప్పాడు.
యుధిష్ఠిరుడు మళ్లీ తన రెండవ ప్రార్థనగా…"దేవా ! విమానంలో కూర్చోవడానికి ఈ కుక్కను కూడా అనుమతించండి" అన్నాడు.
దేవేంద్రుడు “ధర్మాత్ములైన మీరే ఇలా మాట్లాడవచ్చునా ? స్వర్గంలోకి కుక్క ఎలా పోగలదు ? పుణ్యానికి నోచుకోని ఈ మృగానికి నా ధర్శనమే గొప్ప భాగ్యం!
యుధిష్ఠిరుడు ! ఇది నన్ను నమ్ముకొని వచ్చింది. నా పట్ల దానికున్న భక్తివిశ్వాసాల కారణంగానే అది హస్తినాపురం నుండి ఇంత దూరం వచ్చింది.
మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళను నిరాధారంగా వదిలిపెట్టడం అధర్మ కార్యం!
దీనిని ససేమిరా విడిచి పెట్టలేను
ఇది లేకుండా నేను మాత్రం స్వర్గంలోకి అడుగుపెట్టడం నాకు సుతరామూ ఇష్టం లేదు!
దేవేంద్రుడు “రాజా ! వారు చేసుకున్న
పుణ్యకార్యాల. ఫలితంగా స్వర్గం ప్రాప్తిస్తుంది.”
ఈ కుక్క అటువంటి పుణ్యకార్యాలు చేసి ఉంటే ఇటువంటి నిమ్నమైన కుక్క జన్మను పొంది ఉండేది కాదు
యుధిష్ఠిరుడు ! అలా అయితే నేను నా పుణ్యలంలో ఇప్పుడే ఈ కుక్కకు సగం ధారపోస్తున్నాను.
ధర్మరాజు ఆ మాటలు పలుకుతూ ఉండగా… “యుధిష్ఠిరా ! భళీ ! భళీ !”అనే ప్రశంసలు వినవచ్చాయి
నిన్ను చూసి నేను పరమానంద భరితుడనైనాను! అంటూ ఆశీర్వదిస్తూన్న ధర్మదేవత అయిన యమధర్మరాజుని యుధిష్ఠిరుడు చూశాడు
ఇంతవరకు కుక్క రూపంలో వచ్చి పరీక్షించినది ధర్మదేవతే అని గ్రహించిన ధర్మరాజు.
ఎంతో వినమ్రతతో ఆయనకు ప్రణమిల్లాడు ✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment