Friday, November 4, 2022

నిర్వాసనా ముక్తస్థితి లో ఉండాలి ...

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

నిర్వాసనా ముక్తస్థితి లో ఉండాలి ...

ఎరుకకు .. మాయకు .... మనసుకు .. మూలం లేదు .. ఉన్నదానిని గుర్తిస్తే లేనిది లేకనే పోయింది. 

సాధనల వల్ల శరణాగతి ... అంత: స్ఫురణ మేల్కొంటుంది అవ బోధగా. 

తురీయంలో ప్రవేశం ఉన్నవాడు ... అసంగుడు. 

ప్రత్యగాత్మ ... కూటస్థుడు .. ఈ సాక్షి .. ఆ సాక్షి ఒకే బింబం ... ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు. 

సాధనలో మొదటి మెట్టు నిష్కామకర్మ ... చివరి మెట్టు నైష్కర్మ్య సిధ్ధి. 

అజ్ఞానం... అశ్రధ్ధ... సంశయం ... క్రోధం... అశౌచం... ఇంద్రియ లోలత్వం .. ఈ ఆరు లక్షణాలు సాధన తో .. అధిగమించాలి. 

తనకు అన్యం లేదనే నిర్ణయంలో మునిగి ఉండటమే సమాధి. 

తానైన సమాధి నిష్టకు సాక్షి అయినవాడు పరమాత్మ. 

వ్యావహారిక సత్తా ... ప్రాతిభాసిక సత్తా ... పారమార్ధిక సత్తా .. ఇవి సత్తా త్రయం. 

ఏకం సత్ విప్రా బహుధా వదంతి. 
ఉన్న వెలుగు కనపడకపోవటమే చీకటి. 

పంచ కోశ వ్యతిరిక్త: - తాపత్రయ వినిర్ముక్త: - శరీర త్రయ విలక్షణ: 
- గుణత్రయా తీత: - అవస్థాత్రయ సాక్షి ... సచ్చిదానంద స ఆత్మా ...

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
గురుగీత -27

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment