Sunday, November 6, 2022

దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది.

 291022a2146.     301022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀678.
నేటి…

                 ఆచార్య సద్బోధన:
                   ➖➖➖✍️

దైవానుగ్రహం అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి వుంటుంది. 

సాధన అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు అనే కాదు.!
అడవులలో, గృహలలో కూర్చోవడమూ కాదు!! 

సాధన ఎక్కడికో వెళ్లి చేయాల్సిన పనిలేదు!. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసు కొంచం మాధవునిపై పెట్టుకుంటే చాలు. 

చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు భగవంతుని స్మరణ చేసుకోవచ్చు. అయన గూర్చి పాటలను పాడుకోవచ్చు. ఖాళీ సమయాల్లో లేదా పని మీద బయటకు వెళ్లినపుడు ఎవరైనా యాచకులు లేదా దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు  కనబడితే  వాళ్లకి ఎంతో కొంత సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. 

పెళ్లి రోజు, పుట్టిన రోజులంటూ పార్టీలు కోసం డబ్బు వృధా చేసే బదులు.. ఏ అనాధాశ్రమంలో లేదా ఇంకేదైనా సేవా కార్యక్రమాలకో వినియోగించడం చాలా ఉత్తమం. 

దీని వలన దేవునికి గొప్ప సేవ చేసినవాళ్లమవుతాం. దేవుడు కూడా ఎంతగానో సంతృప్తి చెందుతాడు. 

సాధన చిన్నదా పెద్దదా అని భగవంతుడు చూడడు. ఏ భావనతో చేశామా అన్నది చూస్తాడు. దానికి తగ్గట్టుగా అనుగ్రహించడం జరుగుతుంది.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment