🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"377"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మెలకువలో శాంతి కోసం ఏదోక నామం మంత్రంగా జపిస్తుంటాం కానీ నిద్రలో ఏ మంత్రంతో పనిలేకుండానే శాంతి వస్తుంది కదా !?"*
*"నిద్ర మన మనసు యొక్క స్వస్థితిని తెలుపుతుంది. ఆ స్వస్థితి మనంచేసే భాగవన్నామంగా ఉంది. కనుకనే మనసుకు ఏ నామంతో పనిలేకుండానే నిద్రలో శాంతి లభ్యమవుతుంది. అలాంటి పరిపూర్ణమైన శాంతిస్థితిలో ఏ ఆలోచనా నిలబడదు. మన జీవన విధానమంతా అనేక రకాల క్రియలతో ముడిపడి ఉంది. మనంచేసే క్రియల్లో చాలా వరకు బాహ్యజీవనానికి సంబంధించినవే ఉంటాయి. ఏదోకరోజు ఈ బాహ్యజీవనాన్ని వదిలి భగవంతుని పొందాలనిపిస్తుంది. అప్పుడు ఏదోక నామం పట్టుకొని, మనసులో ఆ మంత్రాన్ని సదా నిలిపి వుంచాలని ప్రయత్నిస్తాం. మెలకువలో ఉన్నప్పుడు మనశ్రధ్ధ, ప్రయత్నం చేత అది సాధ్యమవుతుంది. కానీ నిద్ర ఆవహించిన తర్వాత ఈ ప్రయత్నం కొనసాగదు. నిద్రలో కష్టసుఖాలు, ఆలోచనలను వదిలిపెట్టినట్లే మనసు మంత్రాన్ని కూడా వదిలివేస్తుంది !"*
నిద్రలో ఎలాంటి అలోచనలు అలాగే మంచి చెడు ఆలోచన కూడా ఎలా రావో నిద్రలో సృహలేని స్థితిలో ఉంటారు.... అదే స్తితి మెలుకువలో కూడా ఆలోచనా రహిత స్తితి ఎరుకతో సరైన సాధన ద్వారా సాధకులు పొందుతారు..... నిద్రలో మంచి, చెడు కలలు కూడా వస్తాయి... ఎరుక స్థితిలో విశ్వశక్తి పొందడమే ఉంటుంది.
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
*"శ్రీ"*
No comments:
Post a Comment