Wednesday, November 9, 2022

🫖 వంటపనా!🏺

🫖 వంటపనా!🏺

వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు.

కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి.

ఏ ఏ కూరగాయలు దినాలు ఫ్రెష్ గా ఉంటవి ఏవి త్వరగా చెడిపోతాయి అనేది తెలిసుండాలి.

తెలిసుంటే చాలదు.... రోజు ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లి నిర్వహించాలి.

తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు, తినే సామర్థ్యం తెలిసుండాలి.

దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడ పాత్రలు కూడా సమకూర్చుకోవాలి.

రుబ్బాలి....,
వేయించాలి.....,
ఉడికించాలి.....,
పొడి చేయాలి.

...........ఫ్రై.
................డీప్ ఫ్రై చేయాలి.
మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఫ్రై చేయాలి.
అంట్లను కడగాలి.
.............తుడవాలి.
సర్దాలి.
శుభ్రతను పాటిస్తూ.....
యుద్దమే చేయాలి.

నిన్నటి పాలు.
ఈ రోజు పాలు
పాత డికాక్షన్
కొత్త డికాక్షన్
కాఫీ పొడి
టీ పొడి తేడా తెలిసుండాలి.

తెచ్చిన సామానులు
సర్ది పెట్టే
స్టోర్స్ మెనేజ్మెంట్ కూడా తెలిసుండాలి.

రెండు మూడు బర్న ర్ల పై ఒకేసారి - వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్ తెలిసుండాలి.

వడ్డించడం తెలిసుండాలి.
మిగిలిన దానిని ఖాళీ చేసీ ...
వేరే పాత్రలోకీ సర్దుబాటు చేసే
స్పేస్ మేనేజ్మెంట్
తెలుసుండాలి.

అమ్మా..... అంటూ పిలిచే -
వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్నీ పనులు పూర్తి చేయగలిగే
మల్టి టాస్కింగ్ సామర్థ్యము ఉండాలి.

ఒక దోస హాట్ కంటైనర్ లోకి
దూర్చి , మరొకటి ప్లేట్లోకి వేసి , వేరోకటి పెనం పైన వేసే
చేతి వాటం కలిగుండాలి.

నిత్య మేనేజ్మెంట్
చిన్నచిన్న గాయాలు,
చురుకులకు చలించక
కామన్ సెన్సు ,
సమయస్పూర్తి ఉండాలి.

ఇవ్వన్ని ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ - గౌరవాన్నిచ్చే
పెద్ద మనస్సుండాలి.💞

వంటపనా.....,
అదేం మహా!
అని వెటకారించే ముందు -
ఇన్ని సామర్ధ్యాలు, సుగుణాలు మనకున్నాయా 🤔 అని ఆలోచించాలి.

"వంటపని" అందం.
అవసరం
అది అందరి జీవనాధారం.

వంటపని ఒక - ధ్యానం.
భక్తి ,
దినచర్య ,
కళ ,
విజ్ఞానం ,
ప్రేమ...,
అనుభూతి...,
సేవ...,
గౌరవం...,
విలువ...

ఈ విషయాల్లో
వెటకారం తగదు.

వంటింటి
కళాకారులకీ ఓ పెద్ద నమస్కారం.
శ్రీ మాత్రే నమ:

సేకరణ

No comments:

Post a Comment