Friday, November 11, 2022

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴 భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భగవంతుడు తనకు సన్నిహితముగా ఉన్నవారికి అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు. కష్టాలు, నష్టాలు, దుఃఖములు, అవమానములు ఇవన్నీ ఆ పరీక్షలో భాగములే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ' నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరము చేసుకుంటాడా !' అని అయన చూస్తూ ఉంటాడు. ఒకసారి పరీక్షలో పాస్ అయ్యాక మరొక పరీక్ష ఉండటం లేకపోవడం ఆయన ఇష్టం. కానీ ఒకసారి ఫెయిల్ అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు!. ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక. ఈ విషయము మనం చక్కగా గ్రహించి కష్ట నష్టములు వచ్చినపుడు దైవమును నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసముతో సహనము వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు. ఎలా వచ్చిన కష్ట నష్టములు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి. 🌴_*

No comments:

Post a Comment