Friday, November 4, 2022

"దైవీ అనుగ్రహం" లేకుండా "ఆత్మజ్ఞానం" పొందలేమా?

 *"దైవీ అనుగ్రహం" లేకుండా "ఆత్మజ్ఞానం" పొందలేమా?*
*Can't we attain "Self-realization" without "Divine Grace"?*
*~~~*
       -  సద్గురు శ్రీ మెహెర్
          చైతన్యజీ మహరాజ్

(Part - 17)

*(ప్రశ్న:: _సద్గురువు సహాయం చేసే విధానం ఏమిటి  ??_*
               (Or)
_*సద్గురువుని ఆశ్రయిస్తే, మా సంస్కారాలను తుడుచి వేస్తారా??*_)

*గురుదేవులు::  సద్గురువు యొక్క సహాయం రెండు విధాలుగా ఉంటుంది. ఏమిటంటే,*
1)   _*తనకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు, తనతో జీవించేటువంటి వ్యక్తులకు, ఏమి!*_
    ఆ వ్యక్తికి అవసరమైన
   "పనుల" ద్వారా,
    ఆ "పనుల" యొక్క
    నిర్వహణ ద్వారా–
    ఈ "సంస్కారముల"ను
    రహితం చేస్తాడు.
_*(అంటే) తను "అంతర్యామి"యై– బయట బోర్డుకెదురుగా నిలబడి డష్టరుతో అక్షరములను చెరిపివేసినట్లుగా చెరిపివేయడు. (ఎలా చేస్తాడంటే)*_
    ఆ వ్యక్తికి
   "అంతర్యామి"యై,
        "అంతర్యామి"గా ఉండే
         స్థితిలోనే–
         ఆ పనులు చేయడం
         ద్వారా, ఆ
         సంబంధమైనటువంటి
         సంస్కారములను
         రహితం చేస్తాడు–
         తనకు సన్నిహితంగా
         తనతో జీవించు
         వ్యక్తులకు.

*2)    _ఇక తనను విశ్వసించి, తన పరిధిలో ఉండే వారికి– ఈ "ఉపాయముల" ద్వారా సహకరిస్తాడు._*
         *_అంతేనే తప్ప, అందరూ అనుకున్నట్లుగా–_*
    "సద్గురువును
     ఆశ్రయించాము;
     అందుచేత, 
     మన సంస్కారములన్నీ
     డష్టర్ పెట్టి తుడిచివేస్తాడు"
*_అని భ్రమించకూడదు. అటువంటి భ్రమకు ఏ అవకాశమూ లేదు._*
              _కేవలమూ ఈ "అవగాహన"తో మాత్రమే– (అంటే)_
     ఈ "అంతర్యామి"యే
     నాలో ఉండి,
     నా పనులన్నింటికీ
     ఆధారభూతమై,
     నాకు తెలియకుండగా–
          మనం Light on the
          path అనే articleలో
          చదువుకున్నాము,
          జ్ఞాపకం ఉందో లేదో
          (మీకు)!
    ఏ ఆటంకము
    కలిగించకుండగా,
    తన పని 
    తను చేయడానికి–
    తన పనియే
    చేస్తున్నాడని
    తనకు తెలియదు;
     (కానీ) 
         "అంతర్యామియై
          భగవంతుడే ఇదంతా
          నిర్వహిస్తున్నాడు"
          అను అవగాహనతో
          చేస్తున్నప్పుడు,
    నిర్గుణ
    నిరాకారుడైనటువంటి
    భగవంతుడైతేనేమి,
    సగుణ రూపములో ఉండి,
    అవతరించినటువంటి
    భగవంతుడైతేనేమి, (లేదా)
    భగవదనుభూతి పొందిన
    ఏ సద్గురువు అయితేనేమి–
    నీకు సహాయము
    చేసుకునేటువంటి
    బాధ్యత కలిగి ఉంటాడు.
    ఎందుచేతనంటే,
    అది వాడి ప్రారబ్దం గనుక,
   (మన) రామంగారు
    అంటుంటారు.

*ఎప్పుడైతే (వ్యక్తి) "పరిమితము" కాకుండా, ఈ "ఉపాయము" చేత తొలగించుకున్నాడో, అప్పుడు– ఆ వ్యక్తి,*
   "పరిమితమైనటువంటి
    వ్యక్తి"గా కాకుండగా,
       "అనంతమైనటువంటి
        చైతన్యము" యొక్క
        ఎరుకతో,
        చైతన్యము యొక్క
        అనుభవముతో– 
        తాను జీవిస్తూ,
        వ్యక్తపరచగలుగుతాడు,
        వ్యక్తపరచబడతాడు.

*అందుచేత, అసలు తనకు ఉండేటువంటి, తనకు సంబంధించినటువంటి "అసత్యత్వము" ముందుగానే తెలియజేసారు కదా, బాబా.*
         _తాను అనంతమైన చైతన్యమై ఉండడమే కాదు,_
    _తన_
    _"అనంతమైనటువంటి_
    _చైతన్యము"లో–_
    _"అనంతమైనటువంటి_
    _అచేతన స్థితి" కూడా_
    _ఉన్నది;_
    _"అసత్య స్థితి" కూడా_
    _ఉన్నది._
_అందుచేత, తన యొక్క "అసత్య స్థితి" కూడా ఉన్నది._
            _*అందుచేత, తన యొక్క ఈ "అసత్యత్వ స్థితి"ని తాను ఎరుకతో తొలగించుకున్నటువంటి అనుభవమును తాను పొందుతున్నాడు.*_
          _ఆ విధముగా, ఈ పరిమితమైనటువంటి ఈ బుడగ, (అనగా ఈ) "పరిమిత వ్యక్తి"– తన యొక్క అనంతత్వమును వ్యక్తం చేయగలుగుతుంది._
    
          
To be contd.....

No comments:

Post a Comment