హృదయం
ఎవరు తమ హృదయాన్ని పరమాత్మ వైపుకి తీసుకెళ్లాలి అని భావిస్తున్నారో, వారు ముందుగా తమకు వస్తువులపై గల ప్రేమని పక్కన పెట్టాలి. తరువాత వ్యక్తులపై ప్రేమని పెంచుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రేమని కూడా పడవేస్తే పరమాత్మ మీద ప్రేమ కలుగుతుంది.
వస్తువుల నుండి వ్యక్తులకు, వ్యక్తుల నుండి పరమాత్మకు ప్రేమ మార్గం సాగాలి. ప్రస్తుతం మనం వస్తువులను ప్రేమిస్తూ, వ్యక్తులను వాడుకుంటున్న స్థితిలో ఉన్నాము.
ఏ వ్యక్తి అయినా తాను ఏ పనిని చేస్తూ ఉంటాడో, ఆ పనిని చేస్తూ ఉండాలి. దానితో పాటు పరమాత్మ స్మరణ చేయడం సాధన చేయాలి. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో సమస్త కార్యక్రమాలలో, క్షణ క్షణం, కణం కణంలో పరమాత్మ స్మరణ చేయగలిగితే, స్మరణ అనేది విడిగా, మరో పనిగా ఉండదు.
లక్ష్యము ఏమిటో హృదయాన్ని అడగాలి. సాధన ఎలాగో బుద్ధిని అడగాలి. అంతిమ సిద్ధి అంటే ఏమిటో హృదయాన్ని అడగాలి. దాన్ని చేరుకునే మార్గం బుద్ధిని అడగాలి.
హృదయం చేయవలసినది ఎదో చెప్తుంది. బుద్ధి మార్గం, పద్ధతి చెప్తుంది. హృదయం "ఏమిటి ?" అనే దానికి సమాదానం ఇస్తే, బుద్ధి "ఎలా ?" అనే దానికి సమాధానం ఇస్తుంది.
No comments:
Post a Comment