Monday, November 7, 2022

🕉 దృక్ సిద్ధాంతము 🕉

 [11/7, 11:13] +91 73963 92086: సధ్గురుపరబ్రహ్మణేనమః🙏

విధ్యాసాగర్ గురువుగారు ఆశ్వయుజ పౌర్ణమికి అందించిన గురుబోధనుండి🙏

 🕉  దృక్ సిద్ధాంతము  🕉

జ్ఞానం బోధించాలంటె మొదటి అధికారిత్వం ఏమిటంటె... ప్రశ్నించ గలిగే శక్తి. ప్రశ్నించ గలిగే వారికే జ్ఞానయోగం. చెప్పింది విని వెళ్ళిపోయారనుకోండి, వారు జ్ఞానయోగానికి పనికిరారు. అంటె విచారణ మార్గాలోకి ప్రవేశించలేరు. విచారణ ద్వారా బుద్ధిబలాన్ని సంపాదించాలి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక ప్రశ్న రావాలి కదా ! 

పార్వతి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉంటుందా, కలసి ఉంటుందా, ఎలా ఉంటుంది... భార్య, భర్త వేర్వేరుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా ! శరీరంగా చూస్తే వేరు వేరుగా ఉన్నారు, హృదయంగా చూస్తే ఒకటిగా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రగాఢమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు. సదాశివుడు నిశ్చల ధ్యానమగ్నుడై స్థిరంగా, అచలంగా ఉంటాడు. అది సదాశివస్థితి. అమ్మవారు ఏం చేస్తుంటుంది. ప్రపంచం అంతా గిరగరా తిప్పుతూ ఉంటుంది. ఆవిడ పని అది. తిప్పడమే పని. తిరగడమే ఆవిడ పని. సదాశివుడి పని ఏమిటి ? ఎపుడూ స్థిరంగా, నిశ్చలంగా, సహజంగా అచలంగా ఉంటాడు. ఇది సదాశివస్థితి. 

మరి అలా ఆయన ఆస్థితిలో ఉన్నపుడు, ఈవిడ తిప్పాలంటె వేరుగా ఉండాలా, ఇయనతో కలిసిపోయి ఉండాలా ! లోక కల్యాణ నిమిత్తం 'తత్కాలవత్'
ఆవిడ ఏంచేసింది... ఒక అడుగు పక్కకివేసి ప్రపంచాన్ని తిప్పే భారాన్ని స్వీకరించింది. అందుకని మనం అంతా ఏమనుకుంటాం... అంతా అమ్మ దయ అనుకుంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే అయ్య దయ అనుకుంటాం. రెండే ఉన్నాయి. అయితే అమ్మ దయ, లేదంటె అయ్య దయ. 

కానీ ఏమిటీ అమ్మ దయ, అయ్య దయ అంటె, మనకి అనంత విశ్వం కూడా ఎలా గోచరీస్తోంది ? దృశ్యంగా కనపడుతోంది. ఏదైనా సరే మనకి ఎలా కనపడుతోంది... దృశ్యంగా కనపడుతోంది. కాబట్టి ఈ దృశ్యమనే విశ్వాన్ని దాటించడానికి కావలసినది అమ్మ దయ. దృశ్యరహితస్థితికి చేర్చేస్తుంది. అమ్మదయ అంటె, ఏదైనా సరే దృశ్యంగా ఉంది, దృశ్యంలో చిక్కుబడుతున్నావు అనుకోండి, అందులోంచి విడుదల అవ్వాలంటే అమ్మదయ కావాలి. ఈ తెర తొలగించేస్తుంది. ఈ దృశ్యం అంతా లేనిదని నిరూపిస్తుంది. నిరూపించగానే ఏమౌతావు... నువ్వు దాటిపోతావు. అధిగమించేస్తావు. అధిగమించగలిగే బలాన్ని, శక్తిని ఇవ్వగలిగే సామర్థ్యం, ఆ జగన్మాతైన పరాశక్తి దగ్గర ఉంది. ఇదంతా దృశ్యరహితస్థితికి చేర్చే బాధ్యత ఎవరిది ఇపుడు... ఆ పరాశక్తిది.

మరి చూచేవాడున్నాడా లేదా ! చూచేవాడుంటేనే కదా, దృశ్యం కనపడుతోంది. దృశ్యం ఉండాలంటె, ఏం ఉండాలి... చూచేవాడుండాలి. చూచేవాడెవడు... ద్రష్ట. కాబట్టి ఈ ద్రష్టరహితస్థితి, చూచేవాడు లేనివాడు అని నిరూపించాలంటె అపుడు అయ్యదయ కావాలి. చూడబడే దృశ్యరహితస్థితి రావాలంటె అమ్మదయ కావాలి.  చూచేటటువంటి ద్రష్టని అధిగమించాలంటె అయ్యదయ కావాలి. 

ఏమిటీ దయ అంటె, ఏంచేయాలి ? ఎవరిదైనా దయ కావాలంటె ఏం చేస్తాం, మొట్టమొదట ఏం చేయాలి? ప్రాధేయపడాలి. ప్రాధేయపడుతున్నామా ! రోజూ ఉదయం  నిద్రలేచినది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ ఎవరినైనా ప్రాధేపడుతున్నామా ! ప్రాధేయపడటం తక్కువగా భావించకూడదు. ప్రాధేయపడటం ఉన్నతమైన లక్షణం. కృతజ్ఞతాపూర్వకమైన లక్షణం. అతనిలో ఉన్న దయా స్వభావం మేలుకోవాలంటె ఆతనిని నీవు గురువుగా భావించాలి. ఎవరైనా సరే, అతని కృపని సంపిదించాలంటె మొట్టమొదట ఏంచేయాలి... అతనిని గురువుగా భావించాలి. ఎపుడైతే గురువుగా భావిస్తావో అతనిలో ఆ గురువుయొక్క లక్షణం మేలుకుంటుంది. గురువు యొక్క మొదటి లక్షణం దయా స్వభావం. నిజానికి గురంవంగారికి బయటికి వచ్చి మాట్లాడవలసిన పని ఉందా ! ఆయనెపుడూ మౌనవ్యాఖ్యే కదా ! ఆయన నిశ్చలంగా అచలంగా ఉంటాడు. ఆయన స్థితిలో ఆయన సహజంగా ఉంటాడు. ఆయన వ్యాఖ్యలు చెప్పవలసిన పని ఉందా ! లేదు. ఆయన సదాశివ స్వరూపుడు. అక్కడుంటాడు అంతే, ఇయన కిందికి దిగి రావలసిన అవసరం లేదు.  కాని ఆశ్రయించిన వారికోసం మాట్లాడవలసి వస్తోంది. ఎందువలన మాట్లాడుతున్నావంటె, నేను  మాట్లాడటం లేదు, మాట్లాడుతున్నట్టుగా నీకు తోస్తోంది. కాని నేను మాత్రం మౌన స్వరూపంగానే ఉన్నాను. సదాశివుడు "తా కదలడట పరమశివుడు, తా కదిలెడిది మాయయట". ఈ సత్యాన్ని నీకు బోధించాలి. ఈ సత్యాన్ని నీకు అర్థమయ్యేటట్టు చెబితే కాని, నీకు స్ఫురణకు వచ్చేటట్టు చేస్తే కాని, ధ్రష్ఠురహిత స్థితికి ఎదగవు.  చూచేవాడు లేనివాడు అన్న స్థితిలో నువ్వు సదాశివస్థితిని పొందుతావు. ఇపుడు దృశ్యరహితం, ధ్రష్టురహితం. 

ధ్రష్టురహితం కూడా అయిపోతే ఇక మిగిలినది దృక్ రహితం. చూచే చూపే కాదండి, చూడగలిగే బలం ఉంటేనే కదా, ద్రష్ట పనిచేసేది, దృశ్యం కనపడేది. కాబట్టి సర్వ దృక్ రహితమైనటువంటి మయలుస్థితిని లక్షించినట్లైతే అపుడు జన్మరాహిత్యాన్ని పొందుతావు. 

కాబట్టి ముక్తస్థితిని పొందాలంటె ధ్రష్టురహిత స్థితి చేరాలి. జన్మరాహిత్యస్థితికి చేరాలంటె దృక్ రహితస్థితికి చేరాలి. దృశ్యరహితము వలన నువ్వు జ్ఞానంయోగంలోకి ప్రవేశిస్తావు. దృశ్యరహితమయ్యేంత వరకూ నీకు ద్వైతం తప్పదు. అపుడు కర్మబంధం తప్పదు. ఇది దృశ్యము, ధ్రష్ట, దృక్ అనే విషయము. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతం అంటారు.
[11/7, 11:13] +91 73963 92086: ఈ దృక్ సిద్ధాంతం ఎవరికైతే 
బాగా అర్థం అవుతుందో, వారు కేవల జ్ఞానానికి పనికి వస్తారు. కైవల్యమార్గానికి పనికివస్తారు. 
కాబట్టి ఏదృశ్యంలోనూ చిక్కుపడకూడదు. 

సధ్గురువుల బోధ ఏమిటంటే ఏ దృశ్యంలోను చిక్కుపడకూడదు. చిక్కుపడితే తప్పనిసరిగా కర్మబంధం ఏర్పడుతుంది. దానిని జ్ఞానం చేత మాత్రమే విడిపించాలి. కాబట్టి జ్ఞానంచేత విడిపించేటపుడు ఏం కావాలి ?  అమ్మదయ కావాలి, అయ్యదయ కావాలి. అయితే వీరందరూ వేరువేరుగా ఉన్నారా !  లేరు. అందరూ నీ హృదయస్థానంలో ఆత్మస్వరూపమై ఉన్నారం. అందుకని ఆయన సదాశివ స్థతియందు నిశ్చలంగా ఉంటె ఈవిడ ఏంచేస్తుంది ? ప్రార్థిస్తుంది. మౌనవ్యాఖ్యగా ఉన్నటువంటి గురుమూర్తి మాట్లాడాలి అంటె నీవు ఆంతరికంగా చేసేటువంటి ప్రార్థన, వేడికోలు, సర్వస్య శరణాగతి మాత్రమే అతనిని మౌనవ్యాఖ్య నుంచి శబ్ధబ్రహ్మ స్థితికి కిందికి తీసుకువస్తుంది. అట్టి శబ్ధబ్రహ్మముగా కిందికి దిగి వస్తే తప్ప నీకు బోధించేవారు లేరు. మౌనవ్యాఖ్యని అర్థం చేసుకునే స్థితికి నిన్ను ఉద్ధరిస్తే తప్ప నువ్వు ఆ ముక్తిని, మోక్షాన్ని అనుభవం చెందలేవు. 

సధ్గురుచరణారవిందార్పణమస్తు🙏🙏🙏

No comments:

Post a Comment