Monday, November 7, 2022

యోగ రహస్య సాధన

 🔱🕉️ శ్రీ సిద్ధి 🕉️🔱

🕉️🔱యోగ రహస్య సాధన 🔱🕉️

జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయటం .
అయితే పరమాత్మను చేరుకొనుటకు ఏకైక మార్గము యోగమే( ధ్యానం).
అయితే మనిషి ప్రవర్తనకు ,అజ్ఞానానికి, కారణం మనసే.
ఇది ఇంద్రియాల వలన బందింపబడుతుంది ....
ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకు మనసు బంధింపబడుతుందో అప్పుడే మనలో అవరోధాలు పెరుగుతూ వస్తాయి.
ఈ అవరోధాలను అధిగమించే శక్తి మనకి కావాలి....
ఇది పరిస్థితిని బట్టి, ఆలోచనలు , నిర్ణయాలు , రాగద్వేషాలు , కోరికలకు, అలవాట్లకు , లొంగటమే ఈ మనసు పని .
ఇవన్నీ కూడా జీవుడిని (మనిషిని ) బంధిస్తున్నాయి .
ఇలా బంధింపబడిన మానవుడు ఇంకా ఇంకా తను తాను కోల్పోతూ చీకటిలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
వీటన్నిటిని జయించాలి అంటే యోగము (ధ్యానం) తోనే సాధ్యం .
మానసిక ఒత్తిడి ని నిరోధించుటయే యోగము( ధ్యానం).
ఆ స్థితిని మనకు అనుకూలముగా మార్చుకోవాలి .
అలా మార్చుకొని ప్రాపంచిక అంశాలను , విషయాలపట్ల వైరాగ్యాన్ని  సాధించి పరమాత్మను చేరాల్సిన విధానాన్ని సాధన చేయాలి.
ఎందరో అవధూతలు ప్రాపంచిక విషయాలపట్ల వైరాగ్యాన్ని సాధించి
పరమాత్మ తత్వము ని అవలంబించి మనకు మాదిరిగా నిలిచారు. 
మనము ఈ విషయ వాసనలను ఛేదించాలి అంటే
( అనుసరించటానికి) 8 అంశాలతో కూడిన యోగాభ్యాసము చేయాలి.
అవి యమ, నియమం, ఆసనం , ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి . 
ఇవి యోగాభ్యాసానికి సాధనాలు.

ధ్యానమూలం గురుర్మూర్తి,
పూజా మూలం గురుర్ పాదం,
మంత్రమూలం గురుర్వాక్యం,
మోక్షమూలం గురుకృపll

ఇవన్నీ కూడా కావాలి
మనకు సాధన చేయటానికి గురువు యొక్క చేయూత కావాలి.
ఎప్పుడైతే వీటన్నిటిని సాధన చేయటానికి గురు కృపను పొందుతామో......
మనము మనసును ఇంద్రియాలను మన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతాము .
అప్పుడే మనలో ,(మానవునిలో)
విషయ వాసనలు క్షయమైపోతాయి .
ఎప్పుడైతే గురు కృప కలుగుతుందో ...
అప్పుడే మోక్షం ప్రాప్తిస్తుంది
"శ్రీ" శక్తి అపూర్వం.....!!!
" శ్రీ" సిద్ధి అనంతం......!!!
" శ్రీ" గురుభక్తి అఖండం..!!! ✍️
  🌺శ్రీ లక్ష్మీ అనురాధ చావా🌺

మన దృష్టిని లోపలికి మళ్లించడానికి, అంతర్గత రాజ్యంలోకి ప్రవేశించడానికి మరియు మనల్ని మనం చూసుకోవడానికి-మన మనస్సు మరియు అన్ని ఇతర అంతర్గత సామర్థ్యాలను ముఖాముఖిగా చూడగలిగే సాంకేతికతను ధ్యానం అంటారు.
ధ్యానం యొక్క ప్రయోగశాలలో మనం మనస్సు యొక్క రహస్యాలను ఆవిష్కరించగలము.
మనము వాటిని కనుగొన్న తర్వాత మాత్రమే మన ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనల గతిశీలతను అర్థం చేసుకోగలము.

~స్వామి రామ

No comments:

Post a Comment