*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴"పరమాత్మను తెలుసుకోమని వేదాలు బోధిస్తున్నాయి. కానీ పండితులు సహితం వేదాల సారాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. అన్నీ యెరిగిన పండితులే వేద సారాన్ని గ్రహించలేకపోతే ఇంకా సామాన్యులకు ఏ రీతిగా వాటి అర్థాన్ని బోధించగలరు! మానవుడు, ఈ కనిపిస్తున్న సమస్తానికి అసలైన మూలాన్ని గుర్తించినపుడు ఇంకా ఏ విధమైన సాధన చేయనవసరం లేదని వేదములు బోధిస్తున్నాయి. అయితే పండితులు, ఆధ్యాత్మిక వక్తలు, గురువులు ఇట్టి సత్యమును దాచివేసి కేవలం కోరికలు తీరడానికి యజ్ఞాలు, పూజలు, వ్రతాలు చేయమని బోధిస్తే సామాన్యులకు మోక్ష ఫలాలు ఎట్లా అందుతాయి?!. మొదటగా వేదాంగాలను పఠించిన పండితులు, గురువులు, వక్తలు అంతా వేదార్థాన్ని చక్కగా గ్రహించాలి. వేదాలు దేవుని తెలుసుకోవడానికే తప్ప కోర్కెలు తీర్చుకోవడానికి కాదు అనే సత్యాన్ని సామాన్య ప్రజలకు వివరించాలి. తదుపరి కష్టమో, నష్టమో పరమాత్ముడే చూసుకుంటాడు అన్న విశ్వాసము వారిలో కల్పించాలి. అజ్ఞానమును దూరము చేసి జ్ఞానవంతులుగా మార్చాలి. అప్పుడే మానవునికి, లోకమునకు శాంతి సౌఖ్యములు కలుగుతాయి . మానవుడు మోక్షమును అర్హుడు అవుతాడు."🌴_*
No comments:
Post a Comment