పండితుని తెలివి:
మూర్ఖా పురం జమిందారుగారికి మూర్ఖ త్వం కూడా ఎక్కువే. ఆయనకి పురాణాలంటే ఇష్టం.
అందునా మహాభారతం అంటే మహా
ఇష్టం.ఆయనకో కోరిక.కలిగింది.
అదేమిటంటే తనని నాయకుడిగా పెట్టి భారతం రాయించుకోవాలని.
వెంటనే పండితుడు,కవి అయిన కుశాగ్ర శాస్త్రి నిపిలిచి తన కోరిక తెలిపాడు.పండితుడు ''ఆహా''ఎంత
భాగ్యం ఏలినవారి మీద భారతం
రాయడం.నాపూర్వజన్మ సుకృతం
అని ప్రభూ ఓ అయిదు లక్షల వరహాలు,ఐదు సంవత్సరాల వ్యవధి
అవసరం అనగానే అలాగే అని ధనం
మంజూరు చేయించి ఇదిగో భారతంలోనన్ను ధర్మరాజు గా.పెట్టి
రాయిఅన్నాడు.అలాగే నని ధనం తీసుకుని పండితుడు.వెళ్ళిపోయాడు.
కాలం.గిర్రున తిరిగింది. ధనంఅంతా
పండితుడుహాయిగా అనుభవించాడు
అయిదేళ్ళుగడిచాక రెండుబళ్ళమీద
తాటాకులు కట్టలు కట్టితెచ్చాడు.
జమిందారుగారు ఆ బళ్ళనూ తాటా
కులను చూసి మురిసిపోతూ ఏదీ నామీద రాసిన భారతం చదువు అనగానే ఆ పండితుడు వినయంగా
రేపు వినిపిస్తా! చిన్న సవరణ చేయాలి. మీరు చెప్పాక అది పూర్తి
చేసి అప్పటి కి వినిపిస్తా అన్నాడు.
ఏమా సవరణ?
ఏమీ లేదు ప్రభూ!తమరు ఈ భారతంలోధర్మరాజు,జమిందారిణి
గారిని ద్రౌపతి గా రాసాను.
భళా! మంచిపనేచేసితివి కవివర్యా
ఇంకను నా సవరణ ఏమి?
ఏమీలేదు ప్రభూ జమిందారిణి గారి
మిగతా భర్తల పేర్లు చెబితే గ్రంధంలో
ఖాళీ లలో.అవి రాస్తే సరిపోతుంది.
జమిందారుగారికి కోపంవచ్చి ఛీఛీ
అని ఆ.రెండు.బళ్ళతాటాకులును
కాల్చివేయమని ఆజ్ఞ జారీ చేసాడు.
పండితులు,దివానుగారూ అటుతిరిగి
ఫక్కున నవ్వుకున్నారు.
శ్రీ మద్రరమారమణ గోవిందో హరి:
No comments:
Post a Comment