Friday, November 11, 2022

🔥ఏది అహం.. ఏది ఆత్మాభిమానం🔥

 🔥ఏది అహం.. ఏది ఆత్మాభిమానం🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తరచుగా మనం ఆత్మాభిమానంగా 
   భావిన్చేది..ఇతరులకి మన అహం
   భావంలా అనిపిస్తుంది. మరి అహానికి    
  ఆత్మాభిమానానికి తేడా ఏమిటి.


అహం 
   పోలిక వల్ల ఏర్పడుతుంది. నేను ఇతరుల
   కన్నా మెరుగైనవాడిని...గొప్పవాడిని..
   అధికుడిని..పవిత్రుడిని.. ఇలా కారణం
   ఎదైనా కావొచ్చు...ఇతరులని తక్కువ 
   చేయటం వల్ల కలిగే గర్వం..మన అహం
   భావానికి మూల కారణం కావచ్చు.

ఆత్మాభిమానం లేక ఆత్మగౌరవం 
    అంటే పోలికలేకుండా నిన్ను నీవు
    గౌరవించు కోవటం.అదొక హుందా
    తనం. ఈ సృష్టి నిన్ను  కోరుకుందని 
    నీకు గర్వం. ఈ లోకంలోకి ప్రకృతి
    నీకు ఆహ్వానం పలికిందని నీకు 
    గర్వం. అందమైన ఈ సృష్టిలో నీవు
    ఇలా ఉన్నందుకే గర్వం. 

మనిషిగా 
   ఓ వున్నత చైతన్యంతో పుట్టినందుకు 
   నిన్నుచూచి నీవే గర్వించక పొతే.. 
   మరెవరు గర్విస్తారు. ఇక్కడ ఇతరుల 
   ప్రస్తావన లేదు.. పోలిక అసలే లేదు.

తనపట్ల తాను 
   గర్వించటంవల్ల ఇతరులెవరూ తక్కువ    
   చేయబడరు. ఇలాంటి ఆత్మాభిమానం
   అహంకారం కాదు. కనుక ఆత్మగౌరవం
   అహంకారం ఒకటి కాదు...
.

మేధావులంతా మూర్ఖులే అన్నారొకరు.
నిజమే!
ఇద్దరూ వారికి నచ్చినట్టే వారుంటారు మరి
కాకుంటే మూర్ఖుడు మరొకరికి ఇబ్బంది కలిగించి ఐనా; మేధావి ఎవరికి హానీ లేకుండానూ; 
వుంటారు!..
.

నడుస్తూనే ఉన్నాను

నడుస్తూనే ఉన్నాను...!!!
గమ్యం దగ్గర ఆగిపోవడానికి కాదు,
గమ్యాన్ని చేరగానే అలసిపోవడానికి కాదు...!!! 
క్రొత్తగా నడిచేవారికి ఎప్పటికప్పుడు క్రొత్త గమ్యంగా మారడానికి...!!!
నడక ఆపడం నా లక్షణం కాదు...!!! 
అందుకే నడుస్తూనే ఉన్నాను...!!! 
నా దృష్టిలో గమ్యం చేరడం అంటే ఆగిపోవడం కాదు, అలసిపోవడం కాదు, బలాన్ని పుంజుకొని ఇంకా బాగా నడవటం...!!! 
బండరాళ్లు అడ్డమొస్తే సెలయేరునై వయ్యారాన్ని ఒలకబోస్తూ నడుస్తున్నాను...!!!  
అగాధాలు ఎదురయితే జలపాతమై పరవళ్ళు తొక్కుతూ దుముకుతూ నడుస్తున్నాను...!!!
అడవులు దారిలో వస్తే ఔషధాలను తడుపుతూ దాహార్తుల పాలిటి సంజీవని జలమై నడుస్తున్నాను...!!!
ఎందరు అడ్డుకట్టలు వేసినా ఎన్ని ఆనకట్టలు కట్టినా ఓపికతో సహిస్తూ గేట్లను ఎత్తుకుని పంటలు పండించ ముందుకి నడుస్తున్నాను...!!!
దాహమేసి ఆకాశాపు మేఘాలు జుర్రినా వాటి పుక్కిట నిలిచి తియ్యటి వర్షపు చినుకులై మట్టిని ముద్డాడుతూ నడుస్తున్నాను...!!! 
అనంత కాలం నుండి అనంత కాలం వైపుకి 
అనంత దేహాలతో అనంతగా వ్యాపిస్తూ మళ్లీ  ఆవగింజలుగా వెదజల్లబడుతూ ఒకొక్క ఆవగింజనై మళ్లీ అనంతం వైపుకి అనంతంగా వ్యాప్తిచెందుటకు నడుస్తున్నాను...!!!
ఇంతకీ నేనెవరో చెప్పనేలేదు కదూ....
నేను నేనే నేను నువ్వే....
నేనుగా వ్రాస్తున్నది 
నువ్వుగా చదువుతున్నది నేనే 
నేనే మహామూల చైతన్యాన్ని...
.

No comments:

Post a Comment