🔥*జీవుడు - బ్రహ్మము* 🔥
🍁🌼🍁🌼🌻🌼🍁🌼🍁
జీవుడు' అనగా 'వ్యక్తిగత ఆత్మ'. వ్యక్తిగత తత్వాన్ని దాల్చినపుడే తన అస్తిత్వపు స్ప్రహను జీవుడు - బ్రహ్మము
' జీవుడు' అనగా 'వ్యక్తిగత ఆత్మ'. వ్యక్తిగత తత్వాన్ని దాల్చినపుడే తన అస్తిత్వపు స్ప్రహను పొందుతుంది. అదే దాని ఉనికికి మూలాధారమవుతుంది. మొదట్లో 'జీవుడు', 'బ్రహ్మము' రెండూ సరిగ్గా ఒకదానినొకటి పోలి ఉండేవి. జీవుడి ఈ వ్యక్తిగత తత్వమే ఆ రెండింటి మధ్య భేదాన్ని ఏర్పరచింది. ఇప్పుడు ఇది అహంకారం లేదా వ్యక్తిగత తత్వం లోపల పరిమితమై యున్న జీవాత్మగా ఉనికి లోనికి వచ్చింది. అది ఉన్న క్షేత్రం కూడా తన ప్రభావాన్ని దానిపై చూపించడం మొదలు పెట్టింది. రకరకాలైన రంగులు దాని చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి స్థిరపడ నారంభించి దానికి క్రొత్త వన్నెను తీసుకుని వచ్చాయి. ఈ విధంగా భిన్నత్వం స్థిరపడనారంభించి, క్రమక్రమంగా అహంకారం పెంపొంది, మందంగానూ, సాంద్రతరం గాను వృద్ధి చెంద సాగింది. భావాలు, ఉద్వేగాలూ, కోరికలు వాటి వంతుగా దాని స్థౌల్యత పెరగడానికి తోడ్పడ్డాయి. ఆ విధంగా 'జీవాత్మ' ఒక బంగారు చిలుక లాగా శరీరమనే ఇనుప పంజరంలో తనను పూర్తిగా బందీ చేసుకున్నది. ఇదంతా (అహంకార పరిధిలో) ఆలోచనల, ఉద్వేగాల, భావాల, కోరికల చర్యలు, ప్రతి చర్యల ప్రభావాల ఫలితమే. ఇది దాని అపార దర్శతకు జత చేసుకుంటూ పో సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే 'జీవాత్మ' మొత్తం చరిత్ర...
*ఋషులు మనకు నాలుగు రూపాలను ఇచ్చారు అవి*...
చిత్తము :. ఆలోచనాశక్తి
మనసు. ;. ధ్యానించే సాధనము
బుద్ధి. ; విచక్షణా చేయగల, లేదా తీర్మానించి గల సాధనము (మేదస్సు)
అహంకారము, : తీసుకున్న నిర్ణయంపై ధ్యాస: అహం ( నేను ;'నాది' అనే భావన)
సుఖ దుఃఖాలనే రెండిటికి మిశ్రమ స్థితి అయిన మధ్య స్థానములో మనసు విశ్రమిస్తూ ఉంటుంది, ఈ రెండు స్థాయిల నుండి పైకి వచ్చి, కారణ శరీరమైన ఆత్మను చేరుకున్నప్పుడు, మనసుకు ప్రశాంతత, నిశ్చలత, ఎటువంటి చీకూ చింతా లేని ఆనందము కలుగుతాయి, ఇవే( స్థూల, సూక్ష్మ ,కారణశరీరములే) మనసు యొక్క మూడు ద్వారంలు...
*చీకటి ముసుకు క్రింద పడినప్పుడు*
అయిదు రకాలైన లేత రంగుల ఛాయలు తరంగాల రూపంలో ఒకటి తర్వాత మరొకటి అవతరించాయి, ఆ రంగుల్లో వ్యత్యాసం ఉంది, మొదటిది నలుపురంగు, రెండవది పసుపు, మూడవది ఎరుపు, నాలుగవది ఎరుపు ఛాయతో కూడిన తెలుపు, ఐదవది శుద్ధమైన తెలుపురంగు,ఈ రంగులన్నీ "మహాకాళ" మండలానికి చెందినవి, "కాలపురుషుడు" బ్రహ్మము యొక్క మూడు రూపాలను, అంటే హిరణ్యగర్భ, అంతర్యామి (అవ్యకృత)విరాట్ అనే రూపాలను ధరించాడు, ఇవి "కారణ" 'సూక్ష్మ' ' స్థూల' రూపాలు, మొదటిదైన "హిరణ్యగర్భ" కారణ స్థితి లోనిది, " శూన్యము" "మహాశూన్యము" అనే స్థితుల తో అయిదు ఉప కరణ రూపాలు కనిపిస్తాయి, రెండవది "అంతర్యామి" అనేది సూక్ష్మమైన అస్తిత్వము, దీనిలో కూడా ఐదు ఉపరూపాలు ఉన్నాయి, ఇవి శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన అనేవి, ఇది "త్రికూటీ" యొక్క ప్రదేశము మూడవది "స్థూల" స్థితికి చెందిన "విరాట్" రూపం, దీనిలో కారణ స్థితిలోనీ ఐదు ఉపరూపాలు, మరో రూప ధారణ పొంది పంచభూతాలు గా మారాయి, అవి ఆకాశము, అగ్ని, వాయువు, నీరు, భూమి, ఇది "సహస్త్ర దళ కమల" ప్రదేశము మూడు శరీరాలు "బ్రహ్మము" లో ఎలాగైతే ఉన్నాయో, అలాగే అవి వ్యక్తిగత ఆత్మలో కూడా ఉన్నాయి, బ్రహ్మము, మాయల కలయిక వలన పుట్టిన సమస్త జీవరాశులు అదే చీకటి ముసుగు (అవరణ) రూపంలో ఉన్నాయి.....
🌹సర్వేజనా సుఖినోభవంతు 🌹
.
No comments:
Post a Comment