[11/9, 23:00] +91 98664 59075: వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి, ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి
[11/9, 23:00] +91 98664 59075: వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి, ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకర్ తివారీ. ఫిబ్రవరి 12, 1824న గుజరాత్ కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో జన్మించాడు మూలశంకర్ తివారీ. తల్లిదండ్రులు శుద్ధ చైతన్య, కర్సన్ దాస్ తివారీ.
ఆ రోజు శివరాత్రి పర్వదినం. రోజంతా ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి వేళ శివాలయం చేరుకొని పూజలు, భజనలు చేస్తూ జాగారం చేస్తున్నారు. వీరిలో తండ్రితో కలిసి వచ్చిన పద్నాలుగేళ్ల మూలశంకర్ కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న కొందరు భక్తులు క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. మూలశంకర్‌కు నిద్ర పట్టడం లేదు. అప్పుడు గర్భాలయంలో జరిగిన ఓ ఘటన అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక ఎలుక శివలింగం పైకి ఎక్కి, చుట్టూ తిరిగి అక్కడ ఉన్న నైవేద్యాన్ని తినేసింది. మూలశంకర్ మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. రాక్షసులు, దుష్టులను సంహరించే త్రిశూలధారి అయిన పరమ శివుడు ఒక ఎలుకను ఎందుకు ఉపేక్షించాడు? తండ్రిని నిద్ర లేపి ఇదే ప్రశ్న అడిగాడు. సమాధానం చెప్పలేకపోయిన ఆ తండ్రి భగవంతుని గురించి అలా మాట్లాడకూడదని కోపగించుకున్నాడు. కానీ మూలశంకర్ మనస్సులో ఈ ఘటన శాశ్వతంగా నిలిచిపోయింది. సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఆ బాలుడే కాలారతరంలో దయానంద సరస్వతిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆర్యసమాజం అనే గొప్ప సంస్థను లోకానికి పరిచయం చేశారు.
[11/9, 23:00] +91 98664 59075: ఎనిమిదో ఏట ఉపనయనం, గాయత్రీ మంత్ర దీక్ష జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించే మూలశంకర్‌లో శివరాత్రి నాటి ఘటన బలంగా నాటుకుంది. తన 18వ ఏట తన చెల్లెలు కలరాతో చనిపోవడం చూసిన తర్వాత చావును మనిషి ఎందుకు జయించలేకపోతున్నాడు అని ప్రశ్నించుకున్నాడు. అదే సమయంలో సమాజంలో ధర్మం పేరుతో జరుగుతున్న మోసాలకు కలత చెందాడు. తన 22వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మూల శంకర్ అనేక ప్రాంతాలు తిరిగి సిద్ధాపూర్ చేరుకున్నాడు. శుద్ధ చైతన్య పేరుతో సన్యాస జీవితం ప్రారంభించాడు
[11/9, 23:00] +91 98664 59075: తరువాత మూలశంకర్ తన ప్రయాణంలో ఎంతో మంది యోగులు, మహర్షులను కలుసు కున్నాడు. వారి దగ్గర అనేక శాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. మధురలో మహర్షి విరజానంద సరస్వతిని కలిసిన తర్వాత మూలశంకర్ జీవితం మలుపు తిరిగింది. ఆయనే తనకు సరైన గురువని గ్రహించాడు. విరజానంద దగ్గర వేదోపనిషత్తులను నేర్చుకున్నాడు. మూలశంకరునిపై ఎంతో ప్రేమను కురిపించిన విరజానంద ఆయన పేరును ‘దయానంద సరస్వతి’గా మార్చారు.
కొంతకాలం తర్వాత దయానందుని విద్యాభ్యాసం పూర్తయింది. గురువుకు కొన్ని లవంగాలు దక్షిణగా సమర్పించిన దయానందుడు తాను ఇంతకన్నా ఏమీ ఇచ్చుకోలేకపోతున్నానని బాధపడ్డాడు. అప్పుడు విరజానందుడు తన ప్రియ శిష్యునికి సందేశం ఇచ్చాడు. అనేక రుగ్మతలతో బాధ పడుతున్న మన సమాజానికి వేద సందేశాన్ని అందించి చైతన్య పరచాలని సూచించాడు. అదే తన గురు దక్షిణ అని స్పష్టం చేశాడు
No comments:
Post a Comment