*:::::::::: నోరు:::::::::*
మన నోరు మన మానసిక స్థితిని,మన ఉద్వేగాలను క్రింది పనులు ద్వారా తెలియ పరుస్తుంది.
*కొరకడం* పిల్లలు ఇతర పిల్లలను కోపంతో కొరుకు తారు. పెద్దలు పళ్ళు నూరతారు.
*ఉమయడం* ఇతరుల పట్ల మన కోపాన్ని,చులకన భావాన్ని ఛీ పోరా అని ఉమ్ము ఉమయడం ద్వారా తెలుపుతాం.
*పీల్చడం* ఒక వస్తువు పట్ల ఇష్టాన్ని గాలి పీల్చుతూ తెలియ పరుస్తాము
*నమలడం* ఏమీ తెలియ నప్పుడు అయోమయంలో నోట్లో నీళ్ళు నములుతాము.
*నాలుక కొరకడం* తప్పు జరిగిపోయింది అని పశ్చాతాపం వెల్లడిస్తాం.
*పెదాలు కొరకడం* అతి కోపాన్ని తెలియ పరుస్తాము.
*మింగడం* భయంగా వున్నప్పుడు,ఏమి చెప్పాలో తెలియ నప్పుడు, ఉమ్ము మింగుతూ గుడక వేస్తాం.
*తెరవడం* ఆశ్చర్యం వేసినప్పుడు నోరు తెరుస్తాం
*ముడవటం* అలకని నోరు ముడవడం ద్వారా తెలుపుతాము.
ఇవి కాక పొగ పీల్చడం, వక్క నమలడం, పాన్ తిని ఉమయడం, చిరుతిళ్ళు, గోళ్ళు కొరకడం, ఇవన్నీ మనలోని ఆందోళనని బయట పెడతాయి
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment