💖💖💖
💖💖 *"389"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"సృష్టి విధానం, క్రియలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలి ?"*
*"సృష్టి విధానాన్ని అధిగమించటం ఎవరికి సాధ్యం కాదు. రావణాసురుడు వంటి రాక్షసుడిని చంపటానికి భగవంతుడే శ్రీరామునిగా అవతరించాడు. సాక్ష్యాత్ భగవంతుడే కదా మానవరూపంలో ఎందుకు రావాలి ? సకల విద్యలు నేర్చుకొని ఒక కారణాన్ని ఆధారంగా చేసుకుని రావణాసుడ్ని ఎందుకు చంపాలి ? సంకల్ప మాత్రం చేత చంపలేడా ? అనే సంశయాలు రావటం సహజం. కానీ ఈ సృష్టి క్రియలన్నీ ఒక నిర్ధిష్ట విధానంలో జరుగుతుంటాయి. ఏదైనా ఈ సృష్టి విధానానికి లోబడి జరుగవలసిందే. మనం కొన్ని కావాలనీ, కొన్నింటిని వద్దని అనుకుంటాం. కానీ దేహకర్మలు మనం వద్దంటే ఆగేవి, కావాలంటే వచ్చేవి కావు. బాహ్య లక్షణం అంటేనే అది సహజ లక్షణం కాదని అర్ధం. దేహ కర్మలు నువ్వు అనుకొని పోగొట్టుకొనేవి కావు. మన ఇష్టాఇష్టాలతో పనిలేకుండానే ఈ దేహంతో ప్రకృతి అన్ని పనులు చేయించటం బాహ్య లక్షణంలో ఒక భాగం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment