మీకో చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి...!
🐾ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి.
కప్ప సహజగుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది.
👉ఇది కేవలం కథ కాదు.
ఇందులో చాలా నీతి ఉంది!
🌿ఎలా చనిపోయింది? వేడి నీటి వల్ల! ఇదే కదా మీరిచ్చే సమాధానం.. నిజమాలోచించండి కప్ప వేడినీటి వల్ల చనిపోయిం దా? లేదు. వేడి నీటి లోంచి ఎప్పుడు బయటకి దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది.
👉నీరు వేడెక్కడం దానికి తెలుసు. మరి జాగ్రత్తపడిందా..లేదు. నీళ్ళు కొంచమే వేడెక్కాయిగా.. సర్దుకు పోదాంలే అనుకుంది. నీరు మరిగే సరికి కంగారేసింది. కానీ బయటకి దూకలేక పోయింది.
👉అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవడానికి ప్రయత్నించాల్సిందే! అడ్జస్ట్ అవడం వేరు..పైకిఎదగకుండా అక్కడే ఉండిపోవడం వేరు.
👉ఎదుటివాడికి మనల్ని హింసించే అవకాశం ఇచ్చా మనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మొదట్లో ఎలాగోలా భరించగలం. కానీ చివరికి వచ్చేసరికి అది దుర్భరమైపోతుంది. అందుకే మనకు శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకి వచ్చేయాలి.
👉పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది. కనుక సకాలంలో సరైన నిర్ణయం తీసుకోడం చాలాముఖ్యం.🍁
🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳🐳
No comments:
Post a Comment