Sunday, November 6, 2022

క్రియలకు జ్ఞాపకాలతో కూడిన ఆలోచనలకు మధ్య ఉండే అనుభూతి పర్యవసానం ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"371"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"క్రియలకు జ్ఞాపకాలతో కూడిన ఆలోచనలకు మధ్య ఉండే అనుభూతి పర్యవసానం ఏమిటి ? "*
**************************

*"మనం క్రియల్లో సంతోషం, దుఃఖం పొందటం సహజం. అనివార్యం కాని ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో కూడా అదే పొందటం అవివేకం. నిజానికి దుఃఖం, సంతోషం అంటున్నాం కానీ ఆ సమయంలో మనలో జరిగే పరిణామానికి, మనలోని మూలవస్తువులో వచ్చే మార్పు ఏదైనా ఉందా అని కనీసం ఆలోచించం. మన పెళ్ళి వీడియోను అనేకసార్లు చూసుకుంటాం. వీడియోలో కనిపించేది నిజమైన పెళ్ళి కాదు. కానీ పెళ్ళి దృశ్యాలను చూస్తూ అంత ఆనందం పొందటానికి అలవాటు పడ్డాం. అందుబాటులో లేని పిల్లాడి ఫోటో చూసి సంతోషపడతాం. మన జ్ఞాపకాలను కూడా అనుభవాలంత గాఢంగా స్వీకరిస్తున్నాం. జ్ఞాపకాలకు కూడా క్రియలకు ఇచ్చినంత విలువ ఇస్తాం. కానీ నీవు ఎంతసేపు ఆలోచించినా దానికి వచ్చే నష్టం లేదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             🌼💖🌼💖🌼
                   🌼🕉️🌼
                 

No comments:

Post a Comment