💖💖💖
💖💖 *"369"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసును అంతర్ముఖం చేయలేకపోతున్నాను ఎలా ?"*
**************************
*"ఇష్టాన్ని సాధనగా మార్చాలి.."*
*"నిరంతరం దైవనామస్మరణతో పవిత్రమైన జీవనం కొనసాగించటమే దైవత్వానికి మన పూర్వీకులు చూపిన సోపానం. మనందరం దానినే ఆచరించాల్సివుంది. చంటి పిల్లలు పది బొమ్మలను ముందు వేసుకొని దేనితోనూ సరిగా ఆడలేక అవస్థలు పడుతున్నప్పుడు, తల్లి వాటి నుండి ఒక బొమ్మను వేరుచేసి చేతికిచ్చి మిగిలినవన్నీ దాచిపెడుతుంది. ఆ పిల్లవాడికి ఒక బొమ్మతో సక్రమంగా ఆడుకోవడం నేర్పుతుంది. ఇక్కడ ఆ పిల్లవాడి ఇష్టాన్ని కాదనకుండానే వాడికి జాగ్రత్త అలవడుతుంది. అలాగే మనకు బాహ్య ప్రపంచంపై ఇష్టం ఉంది. శాంతి అంతరంగంలో ఉంది. మనసును ఉన్నఫళంగా అంతర్ముఖం చేయలేము. అందుకని మనసును రూపనామాలపై ఇష్టాన్ని కల్పించుకుని ధ్యానించే ప్రక్రియను పూర్వికులు మనకు అందించారు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం""*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment