*జీవన్ముక్తి*
*Living Dead*
*~~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part - 2 )
*గురుదేవులు:: ఈ "జీవన్ముక్త స్థితి"ని గురించి మన యొక్క ఈ సాంప్రదాయ గ్రంథములలో అనేక విధములుగా చెప్పి ఉన్నారు. మెహెర్ బాబా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు, ఒక ప్రవచనము°°లో.*
_ఆ ప్రవచనములో జీవన్ముక్తుని యొక్క స్థితిని గురించి చెప్తూ,_
ఏ వ్యక్తయితే,
మరణించినటువంటి
అనుభవముతో
జీవించగలుగుతాడో,
ఆ వ్యక్తి "జీవన్ముక్తుడు"
_అని తెలియజేసారు._
*"మరణించినటువంటి అనుభవముతో" అనంటే–*
మరణించినటువంటి వ్యక్తి
యొక్క అనుభవములో,
- శరీరము గానీ,
- ప్రాణము గానీ,
- మనస్సు గానీ
- వాటి యొక్క
తాదాత్మ్యత గానీ
లేని ఏ జడపదార్థముగా
అయితే ఉంటాడో,
అదే విధముగా,
తనకు
మనస్సు కలిగి,
ప్రాణముండి,
శరీర తాదాత్మ్యత
ఉండి కూడా,
మరణించినటువంటి
అనుభవముతో,
(అనగా)
మరణించిన వ్యక్తి వలె
తాను
జీవించగలుగుతాడో,
ఆ వ్యక్తి "జీవన్ముక్తుడు"
అన్నారు.
*ఇంకా వివరిస్తూ,*
* ఏ వ్యక్తి జీవించి ఉండి
"మరణానుభవాన్ని"
పొందుతున్నాడో,
ఆ వ్యక్తి యొక్క శరీరము–
"పరిమితమైనటువంటి
శరీరానుభవము"లో
కాక,
"విరాట్ స్థితి" యొక్క
అనుభవములో
ఉంటుందనిన్నీ,
అంటే–
"సమస్త సృష్టి
తానే అయ్యున్నాను!"
అనేటువంటి
అనుభవములో
ఉంటుందనిన్నీ,
* అదే విధముగా,
తన "పరిమితమైనటువంటి
ప్రాణము" కాక,
తన జీవనానికి
ఉనికి అయినటువంటి
'పరిమిత ప్రాణము' కాక,
ఈ సృష్టినంతనూ
నిర్వహింపచేసేటువంటి
ఏ "అనంత శక్తి"
అయితే ఉన్నదో,
ఆ శక్తియే తానై
ఉంటాడు అనిన్నీ,
* అదే విధముగా,
'పరిమితమైనటువంటి
మనస్సు' కలిగి తాను,
(అంటే)
ఆలోచించేటువంటి
వ్యక్తిగా తాను ఉండక,
"విశ్వ మనస్సు"తో
తాదాత్మ్యత చెంది
వ్యవహరిస్తాడు
*అని తెలియజేసారు. అంటే,*
"మరణానుభవము"
పొందినటువంటి వ్యక్తి
జీవిస్తున్నాడు అంటే,
అలాగ జీవించేటువంటి
వ్యక్తికి–
"పరిమితమైనటువంటి
మనస్సు" ఉండదు.
*ఏమిటి ఈ "పరిమితమైనటువంటి మనస్సు" అంటే...*
To be contd.....
--------------------------
°° The Path of Love గ్రంథములోని "On the Living Dead" అనే సందేశం
No comments:
Post a Comment