*🌸హృదయ శుద్ధి*🌸
మానవ హృదయమే మహోన్నత దేవాలయం
సమస్త దేవతలకు చక్కటి ప్రశాంతి నిలయం
హృదయం దున్నిన దుక్కిలా ఉండాలి
ఏ క్షణాన తొలకరి జల్లులు వర్షిస్తాయో
ఏ హృదయం అనంత సద్భానలను
చకోర పక్షిలా ఆస్వాదిస్తుందో
ఏ హృదయంలో ఎన్ని జ్ఞాన పుష్పాలు
వికసించి విరబూసి ఉవ్వెత్తున లేస్తాయో
హృదయం ఉషర క్షెత్రమైతే
సంకల్ప బీజం గట్టిదైనా వ్యర్ధమే.
సంకల్ప బీజం బలహీనమైతే
హృదయం శుద్ధమైనా వృధాయే
హృదయం సంకల్పం రెందూ మంచివైనప్పుడు
జ్ఞాన తరంగాలు ఉవ్వెత్తున లేసి ఎగిసిపడు
అణు విస్పోటన ప్రభావం కొంత ప్రదేశం వరకే
హృదయ విస్పోటనం విశ్వ వ్యాపిత ప్రభంజనం.
మానసిక సంకల్పాలకు హృదయమే కేంద్ర స్థానం
అందుకే మనసును హృదయంలో విలీనం చేయి.
అనంత దివ్య శక్తులకు నిలయం హృదయం
ఉద్దీపన గావిస్తే మానవాళికే మహోదయం.
హృదయ స్పందన భాషగా మారి బహిర్గతమైతే
శతకోటి మానవ హృదయాలను పులకింపజేస్తుంది.
తలను కాదు హృదయాన్ని అనంతంగా పెంచాలి.
మానవత్వాన్ని చేతలలో పదుగురికి పంచాలి.
ఒక్క సంఘటన చాలు మనిషి పూర్తిగా మారడానికి
ఒక్క హృదయ స్పందన చాలు మానవాళి గమ్యం చేరడానికి
మేడి పూతలాంటి ఒక్క మెరుపు చాలు
హృదయ వికాసం జరిగి విశ్వవ్యాపితమవడానికి
దేవుడెక్కడో ఆకాశం ఆవల కూర్చుని లేడు.
దయగల హృదయంలోనే దాగి ఉన్నాడు చూడు.
ఒక్క సద్గురువు మాత్రమే మహిలో
సత్ శిష్యుని హృదయ తంతిని మీటగలడు.
యావత్ ప్రపంచానికే బొధించగల
మహా ప్రవక్తగా మార్చగలడు...
*నాలుగు బంధనాలు తొలగాలి*
నాలుగు నాశనాలు జరగాలి....
""స్వప్ననాశాత్ జాగృతస్యతే "".......1
స్వప్నం ...అంటే నేను శరీరమే
అనుకోవడం....అది నాశనం కానంత వరకూ
జాగృదావస్త కలగదు...నిద్రలో ఇది స్పష్టం అవుతుంది..
శరీరం నిద్రపోతూ వుంటుంది...కానీ కల అని నువ్వు అనుకొనే వాడెవడు...ఆ కలలో విహరించే వాడు ఎవడు..
శరీరం కాదు గా...శరీరం గురకలు పెట్టి నిద్ర పోతుంది గా..
మరి ఆ సూక్ష్మ లోకంలో ఉన్నదెవరు...?
""అజ్ఞాన నాశాత్ మొక్షతస్యతే """........2
భగవంతుడు వేరు నేను వేరు అనుకోవడం కంటే అజ్ఞానం ఏమీ లేదు.. అది నాశనం కానంత వరకూ,,,మోక్షం లేదు..
అజ్ఞానం నుండి పుట్టే బంధం,,,భాధ,,,దుఃఖాల నుండి
మోక్షం లేదు...కాబట్టి నేను శరీరం కాదు అన్న సత్యాన్ని తెలుసుకోవడానికే ధ్యాన సాధన వుంది....
"""గుణ నాశాత్ నిర్గుణస్యతే""..........3
గుణం నాశనం కానంత వరకూ ,,,
ఏదో ఒక పత్యేక నేనులో తగుల్కొంటూనే వుంటాం..
నేను వేరు మిగతా ""అంతా ""వేరు అని తగొల్కుంటూ వుంటాం...ఇదే గుణం ...ఈ గుణం నాశనం కానంత వరకూ... నిర్గునుడివి కాలేవు...కాబట్టి...గుణం నాశనం కావాలి....
కల్ప నాశాత్ నిర్వాణశ్యతే..........4
ఏదో ఒక కల్పన చేస్తూనే వుంటాం...అది వికల్పమో,,, సంకల్పమో,,,, సవికల్పమో,,, ఎదో ఒక కల్పన,,, మోదుకోవడానికి ఏ రాయి అయితేనేమి....కాబట్టి
ఏ కల్పనలూ లేదు...అప్పుడే...నిర్వాణ స్థితి వస్తుంది...
.
చైతన్యం జీవితం అనుభవం నకు, ప్రతీ అనుభవము నకు కూడా ఆధారంగా ఉంటుంది.
నీది అనబడే ఆలోచనలకు గాని, స్పర్శ అనుభవం నకు గాని నీకు ఆధారంగా ఉండి, నీలో ఉండే చైతన్యం జీవము యొక్క చైతన్యం వలె పిలువబడుతుంది. స్త్రీ అనబడే స్థితిని స్త్రీ వలె, పురుషుడు అనబడే స్థితిని పురుషుని వలె జీవించడం, ప్రతీ జీవము కలిగిన సమస్తమైన జీవులను కూడా నడిపిస్తుంది చైతన్యం అంటారు.
చైతన్యం చైతన్యం వలె గుర్తించడం సాధ్యం కాదు. సంస్కారములు పూర్తిగా రహితం చెందితే మనము చైతన్యం గుర్తించడం సాధ్యం అవుతుంది. ఆలోచనలు యందు నీవు నిఘా ఉంచితే, ఆలోచనలకు సంబంధించిన క్రమం నీవు గుర్తించి, ఆలోచన పూర్తి అయినప్పుడు మరొక ఆలోచన రావటం గుర్తిస్తారు. CONTINUE ఆలోచనలు చేస్తూ ఉన్నాను అనిపిస్తుంది కాని ఆలోచన, ఆలోచన మధ్య SECOND TIME GAP ఉంటుంది. GAP శూన్యం కాదు, విరామం కాదు, అదేమంటే చైతన్యం. అది సంస్కారములు లేనిది పరిశుద్ధ చైతన్యం. దానిని పెంచుకోవడం చెయ్యాలి ...
.
ఒక రోజు కబీర్ దాస్ ఒక ఊరిలో ఉండగా..
ఆ ఊరి ధనవంతుడు
తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు.
కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు.
వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ,
అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు. ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు. తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’ అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు.
ఆత్మ, పరంగా అందరిలో ఉన్న
భగవంతుడు మాత్రమే శాశ్వతం.
ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు.
ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...
.
మనతో వచ్చేదేమిటి
ఒక ఆదివారం ఉదయం, ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది. ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ, ఆగి, దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది.
ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి, విశ్లేషించి, ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి, ఆకు మీద నడిచి, అవతలి వైపుకు వెళ్లి, ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది.
దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది, పరిమాణం తక్కువగా ఉంది.., కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది.
కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు - అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది.
చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు..? దానికి అది సాధ్యం కాలేదు..!
అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది.
చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు.
మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము, మన ఉద్యోగం గురించి చింతిస్తాము, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ నివసించాలి, ఎటువంటి వాహనం కొనాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి... అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం.
మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించకోలేము...
.
సేకరణ...
No comments:
Post a Comment