💖💖💖
💖💖 *"538"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"బయటి వస్తువులు, విషయాల ద్వారా లభించే సంతోషం, సుఖం తెలుస్తుంది కానీ మనసు తన నుండి తాను పొందేది ఏమిటో అర్థం కావడం లేదు ?"*
*"మనం పొందుతున్న ప్రతి అనుభవంలోనూ మనసు తన నుండి తాను పొందే ఫలం, ఎదుటి వస్తువు నుండి పొందే ఫలం జంటగానే లభిస్తున్నాయి. మనకిప్పుడు ఎదుటి వస్తువు నుండి వచ్చే ఫలమే తెలుస్తుంది. అందులోనే మనసు నుండి మనసు పొందే 'శాంతి 'అనే ఫలం కూడా కలిసిపోయి ఉన్నట్లు గ్రహించలేక పోతున్నాం. అలా నిరంతరాయంగా ఉన్న శాంతి మన గ్రహింపులోకి వచ్చేందుకు మనసును అనుసరించే ఉంటుంది. అందుకే మనసును గమనిస్తూ ఉండటంచేత నిరంతరాయంగా ఉన్న ధ్యానం ఏదో ఒక రోజు దానంతట అదే ఆవిష్కరింప బడుతుంది. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోతున్నామన్న విషయం అప్పుడు అర్థమవుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment