మనకు సద్గురువు లభించే వరకు మహాత్ముల బోధలు,ధ్యానం రోజు కొద్దిసేపు అవసరం.ఏంత వరకు అవసరమో అంతే చాలు.కష్టపడి సాధనలు చేయవలసిన పనిలేదు. మనకు అదృష్టం ఉంటే మనకోసం కష్టపడే వారు రావచ్చు,చేయచ్చు. సద్గురువులు ఉంటే నీ ఇంటికే వచ్చి నీకు దర్శనం ఇస్తారు.అంత వరకు నిలకడ ఉంటే చాలు.శ్రద్ధ విశ్వాసం ఉంటే ఏందుకు రాడు. వచ్చేది ఏవరో ఏవరికి తెలియదు. కాలదేశాలకు అతీతమైనవాడు క్షణాల్లో ఏక్కడికయైన రాగలడు. అందుకు తగ్గట్లుగా మనం ఉండాలి. జీసస్ మాట్లాడుతూ పెండ్లికొడుకు పెండ్లి కార్యాలు ఉన్నంత వరకు మంచి భోజనాలు రోజు ఉంటాయి. ఏవరు ఉపవాసం ఉండవలసిన పనిలేదు అన్నారు. అంటే సత్పురుషుల ఉన్నంత వరకు ప్రార్థన,సాధనలు అవసరం లేదని అర్థం.
No comments:
Post a Comment