Thursday, April 27, 2023

ప్రశ్న :- సంసారం ఎందుకింత దుఃఖభరితము, ఎందుకింత దుష్టం?

 🌹ప్రశ్న :- సంసారం ఎందుకింత దుఃఖభరితము, ఎందుకింత దుష్టం?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

"భగవదేచ్చ!"

🌹ప్రశ్న :- ఆ విధంగా భగవంతుడు ఎందుకు సంకల్పిస్తాడు?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

అది అనూహ్యం. ఆ శక్తికి ఏ ప్రయోజనాన్ని ఆపాదించలేం. దానికి వాంఛ లేదు. లక్ష్యం లేదు. అది అనంతం, వివేకవంతం, సర్వశక్తి సమన్వితం. తన సమక్ష్యంలో, ప్రపంచంలో జరిగే వాటి వల్ల భగవoతుడు ప్రభావితుడు కాడు. ప్రపంచంలో జరిగే వాటిని, సూర్యుని పోల్చి చూడు. భాద్యతని గాని, ప్రయోజనాన్ని గాని ఆ ఏకటతకి ఆపాదించాలనుకోవటంలో అర్ధం లేదు.

🌹ప్రశ్న :- అన్నీ భగవంతుని సంకల్పం వల్లనే జరుగుతాయా?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

అన్నిటిని చేయగల సామర్ధ్యం కల భగవంతుని ఆజ్ఞకు భిన్నంగా ఎవ్వరూ, ఏమి చేయలేరు. అందువల్ల కుటిలము, అసంపూర్ణము, విబ్రాంతము అయిన మనస్సు కల్పించే వ్యాకులపాటు నంతా విడిచి భగవంతుని పాదాల చెంత మౌనంగా ఉండు.

..... సేకరణ : నీ సహజస్థితిలో ఉండు, ఆంగ్లమూలము డేవిడ్ గాడ్ మ్యాన్ తెలుగు అనువాదము పింగళి సూర్యసుందరము

..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్

No comments:

Post a Comment