Wednesday, November 8, 2023

పరమాత్ముడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాడు అన్న సత్యం గ్రహించి నడచుకోవాలి..!

 020122-1.    120323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀460-794.
నేటి…
              *ఆచార్య సద్బోధన:*
                  ➖➖➖✍️

*దేవుని దయాదాక్షిణ్యాలు కోసం….             మనం ఎన్నెన్నో బాహ్యఆర్భాటాలు చేస్తుంటాం.* 

*అయితే వాటికి భగవంతుడు చిక్కడు. పరమాత్ముని దయకై తీవ్రమైన ఆవేదన కావలెను.* 

*అంతే! శిశువు రోదనము చేసిన, తల్లి ఆ రోదనము యొక్క రాగమెటువంటిదని పరీక్షించుకొఱకు ఆలస్యము చేయదు. పరుగెత్తి వచ్చి  యెత్తుకొని   బిడ్డకు ఆనందమిచ్చును* 

*అలానే భక్తులు జిజ్ఞాసులై, ఆర్తులై ప్రార్థించిన చాలు, పరుగెత్తుకు వచ్చి ఆదుకుంటాడు.* 

*భగవంతునిలో ఎవరియందునూ భేదభావము యేమాత్రమూ లేదు.* 

*ఆవేదనే పరమాత్ముని సులభముగా కదిలించి కరిగించే ఏకైక సాధన.* 

*కనుక చేసే పూజ, ప్రార్థన, భజన ఎందులో అయినా ఆర్తి, ఆవేదన ఉండేలా చూసుకోవాలి.* 

*పరమాత్ముడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాడు అన్న సత్యం  గ్రహించి నడచుకోవాలి..!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment