Friday, December 15, 2023

ఒకప్పుడు పెళ్లి అంటే....నేడు వివాహ వ్యవస్థను కించ పరుస్తున్న.....

 ఒకప్పుడు పెళ్లి అంటే 11 రోజుల తంతువు జరిగేది... అది క్రమేనా ఐదు రోజులకు కుదించింది... ఇప్పుడు కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమిత మైంది.... పెళ్లంటే అది అద్భుత పవిత్ర బంధం... ఇక్కడ అమ్మాయి మరి ఎక్కడ అబ్బాయి వివాహం అనే బంధం వారిని జత చేర్చి
మాంగల్యం అనే పవిత్ర బంధం ఒక్కటిగా చేసి నడిపిస్తుంది. యిద్దరిని ఒక్క త్రాటి పై నడిపిస్తుంది... గతంలో పెద్దలు చేసే వివాహము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పెద్దలు వారి ప్రమేయంతో సదిశగా పరిష్కార మార్గాలు వెతికేవారు..... ఇప్పుడు భార్యాభర్తల్లో ముఖ్యంగా ప్రేమించుకున్న వాళ్లలో అహం అనేది, ఆర్థిక అసమానతలు అనేటువంటిది  డామినేట్ చేసి అపోహలు చేరి వారి బంధాన్ని చిన్నా,భిన్నం చేస్తుంది.వారిలో సదవగాహన  లేక బాధ పడుతూ ఒకరినొకరు విమర్శలు పోడుచు కాస్తున్నాయి.... బలహీనమైన క్షణాలతో వారి మధ్య స్నేహము బీటలు వారి, కుటుంబాలు కొన్ని విడిపో తున్నాయి... వాస్తవానికి పెళ్లి  అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని చెప్పారు..... కానీ నేడు ఆ వ్యవస్థ కూలిపోయింది..... ఇప్పుడు కేవలం ఒక్కరోజు తంతు వుగా మారిపోయిన ఈ ప్రేమలు,,, పెళ్లిళ్లు వివాహాలు అన్ని కూడా ఒక వ్యాపార ఒప్పందంగా  తయార య్యాయి.... కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో కూడా చాలామంది విజయవంతంగా జీవితాన్ని సాగించి ,,ఎన్నో ఒ డుదుడుకులు , ఎదురైనా నిలబడి జీవిత సాఫల్యాన్ని సాధించుకున్న గొప్పవాళ్ళు కూడా ఉన్నారు... అంటే ఇది ఇరువురి మనసుల మధ్యన ఏర్పడిన ఆత్మీయ బంధంగా మార్చుకున్నలాడే ఈ పెళ్లికి ఒక అర్హత సముచిత భావము ఏర్పడుతుంది...నేడు వివాహ వ్యవస్థను కించ పరుస్తున్న  Soft ware  వ్యవస్థ, చిత్ర సీమ వ్యవస్థలు బ్రష్టు పట్టిస్తున్నారు...అంటే ఆర్థిక ,అసమానత,అహం, మితిమీరిన  స్త్రీ స్వేచ్చ చాలా దెబ్బ తీస్తున్నాయి....
నేను దాదాపుగా 31 సం..ల క్రితం నేటి వివాహ వ్యవస్థ అనే టాపిక్ మీద వ్యాఖ్య వ్రాసి AIR లో చదివాను....అవి స్ఫురణకు తెచ్చుకోనీ, నేటి వ్యవస్థలో మార్పులు కూడా జోడించి అతి తక్కవ సమయం లో వ్రాయ గలిగాను....*అందరూ చదవాలని కోరుతున్నాను*....

No comments:

Post a Comment