Wednesday, December 13, 2023

స్వామి వివేకానందుని తెలివి

 *స్వామి వివేకానందుని తెలివి*
                   ➖➖➖✍️

```స్వామీ వివేకానంద తన 9 ఏళ్ల వయసులో మత మార్పిడి చేయటానికి ప్రయత్మిస్తున్న వాడికి గుణపాటం చెప్పారు.

ఒక రోడ్ పై కొంత మంది నిలబడి ఒక వ్యక్తి చెబుతున్న మాటలు వింటూ వున్నారు.

ఏమిటని వెళ్లి చూడగా ....

ఒక క్రైస్తవుడు ఒక చేతిలో రాతి కృష్ణుడి బొమ్మను ఇంకో చేతిలో చెక్క శిలువ తీసుకుని ప్రజలారా నిజమైన దేవుడు నీటిలో మునుగు తాడా? నిజమైన దేవుడు ఎవరో మీరు చూసి చెప్పండి అంటూ వారిని మతప్రచారానికి ప్రజల అమాయకత్వాన్ని వాడుకుంటూ మొదలు పెట్టాడు. ఒక బకెట్ లో నీళ్ళు తీస్కుని దానిలో మొదట కృష్ణుడి రాతి బొమ్మ ను వేయగానే అది వెంటనే మునిగి పోయింది. తరువాత శిలువను నీటిలో వేయగా అది నీటిలో తేలింది.

అప్పుడు...
 “ఇప్పడు మీకు  నిజమైన దేవుడు ఎవరో తెలిసిందా? కావున మీరు నిజమైన దేవుడి కోసం రేపటి నుండి చర్చి కి వచ్చి ప్రార్దన చేయాలి” అనగానే ప్రజలు సరే అని జవాబు ఇచ్చారు.

అటువైపుగా వస్తూ దీనిని చూసిన వివేకానందుడు వాడి మోసాన్ని గమనించి.....

”అయ్యా మీరు చేసిన పరీక్ష ద్వారా నిజమైన దేవుడు ఎవరో సరిగ్గా తేలలేదు.  భారతదేశంలో అగ్నిపరీక్ష  బాగా ప్రసిద్ది!  కాబట్టి మనం అగ్నిపరీక్ష చేసి దానిని తేలుద్దాం!” అని అక్కడి ప్రజల ద్వారా ఒప్పించారు. ఒక మంట పెట్టి కృష్ణుడి బొమ్మను, శిలువను మంట లో వేసాడు వివేకానందుడు.  

అప్పుడు చెక్క బొమ్మ అయిన శిలువ కాలి పోయింది  కాని రాతి బొమ్మ కృష్ణుడి బొమ్మ ఎటువంటి తేడా లేకుండా బయటకు వచ్చింది. 

“ప్రజలారా దీనిని బట్టి మీకు ఏమర్దం అయ్యింది?” అనగానే.. 

“అవును కృష్ణుడే నిజమైన దేవుడు.” అని వాడు మమ్మలిని మోసం చేయడానికి చుసాడని చీవాట్లు పెట్టి అక్కడ నుండి మందలించి వెళ్ళగొట్టారు.

మతమార్పిడి చేసే కుట్రలు ఆనాటి నుండే వున్నవి.  దానిని చూసిన వివేకానందుడు మత మార్పిడులను తీవ్రమైన విషయంగా పరిగణించి వీరిని అడ్డుకునే ప్రయత్నాలను చేసాడు.✍️🚩🚩🚩🚩🚩🚩🚩
****************```

No comments:

Post a Comment