*వివాహమైన స్త్రీలు కాలివేలికి మట్టెలు ఎందుకు ధరిస్తారు*
స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మట్టెలు, వీటిని కొందరు మెట్టెలు అనికూడా అంటారు కానీ అది సరికాదు.
ఒక స్త్రీకి పెళ్లి అయిందా ? లేదా? అని అడగకుండా తెలుసుకోవటానికి పాదాల వంక చూస్తారు మట్టెలు ఉన్నాయా? లేవా? అని.
మంగళ సూత్రం లాగానే మట్టెలకి పెళ్ళికి అవినాభావ సంబంధం ఉన్నది. పెళ్లి అయిన వారు తప్పని సరిగా మట్టెలు ధరించాలంటారు.
ఎందుకంటే చేతులలో లాగానే పాదాలలో కూడా శరీరావయవాలన్నింటికి సంబంధించిన నాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కాలివేలు మొదలు ఒక్కొక్క కేంద్రం. అరికాలుకి వేలు అతుక్కుని ఉండే భాగం అందరికీ కొంచెం లోపలిగా ఉంటుంది. కాలు నేల మీద పెట్టినపుడు అ భాగం నేలకి తగలదు. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయి. వాటిని సుకుమారంగా వత్తినట్లైతే నాడులు చురుకుగా పని చేస్తాయి. పాదాలని ఆ విధంగా వత్తుకుంటూ కూర్చోవటం కుదరదుకదా. అయినా చేతులతో కాళ్ళు పట్టుకుని కూర్చోవటం దరిద్రం అని కూడా అంటారు మన వాళ్ళు. కాబట్టి అక్కడ వత్తిడి కలిగే ఏర్పాటు చేస్తే సరిపోతుంది అనే ఆలోచనతో బరువైన గుండ్రని మట్టెలు కాలి బొటన వేలి ప్రక్క వేలికి పెట్టుకుంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వేలి క్రింది భాగం నొక్కబడి వత్తిడికి లోనవుతుంది . కాలి బొటన వేలికి ప్రక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది అని చెబుతారు. ఈ వేలికి పెట్టుకున్న మట్టెలు కలిగించే వత్తిడి వల్ల గర్భాశయం స్వస్థ స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు బరువైన మట్టెలు పెట్టుకుంటే గర్భ స్రావం జరగటం వంటివి నివారించ బడుతాయి. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది అని కూడా అంటారు. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు.
సనాతన హిందూ ధర్మంలో స్త్రీ సౌభాగ్యానికి నుదుటిన కుంకుమబొట్టు మెడలో మంగళసూత్రం కాలికి మట్టెలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. వివాహం జరిగిన వెంటనే స్త్రీలు మంగళసూత్రం, మట్టెలు భర్త ఆయుష్షుకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల స్త్రీలు వీటిని ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మట్టెలు మంగళసూత్రం భర్త ఆయుష్షుకి సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
*వివాహం జరిగిన తర్వాత మట్టెలు ధరించే విషయంలో మహిళలు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం.*
వివాహం జరిగిన స్త్రీలు ఎల్లప్పుడూ పాదంలోని రెండవ వేలుకి మట్టెలు ధరించాలి. వెండి మట్టెలు మాత్రమే ధరించాలి. ఇలా పాదంలోని రెండవ వేలుకి వెండి మట్టెలు ధరించడం వల్ల స్త్రీల ఆరోగ్యం, మానసిక స్థితి పెంపొందిస్తాయి.
వివాహితులు పొరపాటున కూడా బంగారు మట్టెలు ధరించకూడదు. ధనవంతులు కాలికి బంగారంతో చేసిన మట్టెలు ధరిస్తూ ఉంటారు అది ఆడంబరానికే.
*బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. కనుక కాలికి బంగారు మట్టెలు ధరించటం వల్ల లక్ష్మీదేవిని కాలితో తాకినట్టు. ఇలా బంగారు మట్టెలు ధరించటం వల్ల లక్ష్మి దేవి ఆగ్రహానికి గురవుతారు.*
వెండి మట్టెలు చంద్ర గ్రహానికి సంబంధించినది. ఈ మట్టెలు ధరించే విషయంలో చేసే పొరపాటు భర్తకు హానికరం. మట్టెలు స్త్రీ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి పొరపాటున కూడ వాటిని ఇతర మహిళలకు ఇవ్వకూడదు. అలాగే అనవసరంగా తరచూ మట్టెలను మీ పాదాల నుండి తీయకూడదు. మట్టెలు పోగొట్టుకోవద్దు.
మట్టెలను పోగొట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఇలా జరిగితే భర్త ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు, వివాహిత స్త్రీలు ఎప్పుడు శబ్దం చేయని మట్టెలు ధరించాలి.
*ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగాథ కూడా ఉన్నది*
దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి కదా. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది అని అంటారు.
*అందుకే వివాహిత స్త్రీలు మట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది.*
అది తన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం కనుక పెళ్లి కుమారుడే స్వయంగా పెళ్లి కూతురి కాలు పట్టుకుని వేలికి మెట్టెలు తొడుగుతాడు. ఇది మట్టెలకున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ఇప్పుడు సరదాకి అన్ని వేళ్ళకి రకరకాలైన డిజైనులలో మట్టేలను పెట్టుకుంటున్నారు. వాటిని పిల్లేళ్ళు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇవి అలంకార ప్రాయాలు మాత్రమే. కాలి రెండవ వేలికి పెట్టుకున్నవి స్త్రీ సంబంధమైన ఆరోగ్య సమస్యలని సరిజేస్తాయి. మట్టెలని కూడా భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాల కతీతంగా ధరిస్తారు. వాటి ఉపయోగం ఉండాలంటే సన్నగా నాజూకుగా ఉండేవి కాక బరువైన వాటిని ధరించాలి.
అది తన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం కనుక పెళ్లి కుమారుడే స్వయంగా పెళ్లి కూతురి కాలు పట్టుకుని వేలికి మట్టెలు తొడుగుతాడు.
ఇదీ మట్టెలకున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ఇప్పుడు సరదాకి అన్ని వేళ్ళకి రకరకాలైన డిజైనులలో మట్టెలను పెట్టుకుంటున్నారు. ఇవి అలంకార ప్రాయాలు మాత్రమే అని గుర్తించాలి. కాలి రెండవ వేలికి పెట్టుకున్నవి స్త్రీ సంబంధమైన ఆరోగ్య సమస్యలని సరిజేస్తాయి. మట్టెలని కూడా భారత దేశంలో అందరు స్త్రీలు కుల మతాల కతీతంగా ధరిస్తారు. వాటి ఉపయోగం ఉండాలంటే సన్నగా నాజూకుగా ఉండేవి కాక బరువైన మట్టెలు ధరించాలి.
No comments:
Post a Comment