Tuesday, December 5, 2023

 నువ్వు కొనుక్కున్న వస్తువు మీదనే నీకు సర్వాధికారాలు ఉన్నప్పుడు,
 దాని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు , 
దానితో నీకు నచ్చినట్టు ఆడుకుంటావు,
 నచ్చకపోతే విసిరి అవతల పారేస్తావ్...

 మరి అలాగే మనల్ని సృష్టించిన ఆ భగవంతుడికి మన మీద హక్కు ఉండదా..? అతను మనతో ఆడుకోకూడదా..?
 మనల్ని తనకు నచ్చినట్టు వాడుకోకూడదా? 
ఇంతంత కష్టం రాగానే భగవంతున్ని నిందించడం లేదా నా కష్టాలని పోగొట్టడం లేదు ఈయనేం దేవుడు 
నేను ఇంకో దేవుని నమ్ముకుంటాను అని 
రాజకీయ నాయకుడు పార్టీ మార్చినట్టు దేవుళ్ళని మార్చడం ఇది ఎంతవరకు కరెక్ట్..? ఆని మనం ఒక్కసారి ఆలోచించాలి..

 మనం కొనుక్కున్న బొమ్మ మీదే మనకు సర్వాధికారం ఉన్నప్పుడు,
 మనల్ని సృష్టించిన ఆ భగవంతుడికి కూడా మన మీద పూర్తి హక్కు ఉంటుందని తెలుసుకోవాలి..
 కష్టాలనిచ్చే భగవంతుడు ఇష్టాలను కూడా సృష్టిస్తాడని గమనించాలి..
 కష్టాలను మనల్ని మరింత రాటుదేలేలా చేయడానికి సృష్టించాడు తప్ప మనల్ని నాశనం చేయడానికి కాదు..
 కాబట్టి దయచేసి ప్రతిసారి భగవంతుని నిందించడం కంటే మన ప్రయత్నలోపమేముందో
 తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నిస్తే అన్నీ మంచి ఫలితాలు లభిస్తాయి...

🙏🏾🙏🏾🙏🏾🙏🏾శుభరాత్రి🙏🏾🙏🏾🙏🏾🙏🏾

No comments:

Post a Comment