చిన్నప్పటినుంచి భగవంతుని పట్టుకోవాలి
➖
*బాధ్యతలన్నీ తీరిన తరువాత భగవంతుణ్ణి స్మరించాలని అనుకునేవాడు సముద్రంలో అలలన్నీ పోయిన తరువాత స్నానం చేయాలనుకునేలాంటివాడు!*
*అలలు పోయాక ఇంకా చేసేది ఏమి ఉండదు.*
*ఆట పాటలతో బాల్యం, ఆకర్షణలతో యవ్వనము, బాధ్యతలతో వయోజనము గడిపేస్తే వృద్ధాప్యములో చేసేది ఏముంది?!!శరీరము సహకరిస్తుందా?*
*చిన్ననాటి నుండి లేని శ్రద్ధ, ఆసక్తులు వృద్ధాప్యంలో ఎక్కడ నుండి ఊడి పడతాయి?!*
*ఇదివరకే విషయ వాంఛలతో నిండిపోయి ఉన్న మనసులో భక్తి విశ్వాసాలు ఎలా పుట్టుకొస్తాయని అనుకుంటున్నారు?*
*ఇది కాదు మనం చేయాల్సింది. చిన్ననాటి నుండే భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఆయనను మనసులో ప్రతిస్థాపన చేసుకుని భాద్యతలని నెరవేరుస్తూ జీవితమంతా గడపాలి. అదీ కీలకం…….
No comments:
Post a Comment