*నమ్మకం, సత్యం ఒక నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక అనుబంధానికి మూల స్తంభాల్లాంటివి. నువ్వు ఓమనిషిని నమ్మకపోతే, అతనికి సత్యం చెప్పలేవు. నువ్వు సత్యం చెప్పకపోతే, ఆ మనిషి నిన్ను నమ్మడు.*
*కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మీలో ఉంటాయో అప్పుడు జీవితంలో మీరు గెలవబోతున్నారని అర్థం.*
*నీ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో టైమ్ నీది కానప్పుడు కొందరి నోరు తప్పుగా మాట్లాడుతుంది. అయినా పర్లేదు, కొన్ని రోజులు చెవులు నీవి కావు అనుకో. నీ లక్ష్యాన్ని నువ్వు అవలీలగా చేరుకోగలవు.*
No comments:
Post a Comment