అన్నీ అన్వేషణలూ ప్రాపంచకాలే
నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని అన్వేషణ మొదలు పెట్టారా!? ఇక దేవుడి కీ ఒక గుడి కట్టి చేసే పూజలు కోరికల చిట్టా కోసమే ఎదో ఆరోగ్యం డబ్బు వ్యాపారం కోసం ధ్యానం చేస్తే రావు ... ఇక మీరు ఎవరో ఎందుకు పుట్టానో ఈ సృష్టి గురించి తెలుసుకోవాలనే అన్వేషణ మొదలు పెట్టారు..
అన్వేషణ చేస్తున్నత సేపు మీరు ఇంకా ఈ ప్రాపంచికం లో ఇరుకోపోతారు...
ఎందుకంటే అన్వేషణే ప్రపంచం కాబట్టి.
అప్రాపంచకాన్ని అన్వేషించలేము కాబట్టి.
ఏ క్షణంలో అన్వేషణ ప్రారంభించామో...
తక్షణమే ఐపోతుందది ప్రాపంచికం!
దేవుడ్ని మనం అన్వేషిస్తే..
దేవుడూ..ఓ భాగమై పోతాడు అన్వేషణా
ప్రపంచంలో! ముక్తిని, నిర్వాణాన్ని ఆన్వేషిస్తే..
కాలేవు అవీ ప్రపంచానికి అతీతంగా!
ఎందుకంటే అన్వేషణ ఆలోచనాపరమైంది.
ముక్తి, నిర్వాణం ఆలోచనా రాహిత్యస్థితి.
మరెలా దీనిని సాధించటం..!?
మనసు వర్తమానంలో నిలిపి వుంచటమే.
ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో just అలా వుంచటమే..మనసును పూర్తి విశ్రాంతి గా ఖాళీగా ఏ కోరిక లేని స్థితి
గతం లేదూ...భావీషత్తు లేదూ
మరైతే ఏముంది అపుడు అక్కడ..!?
వర్తమానంలో మనసు కదిలేందుకు చోటేది !?
సరిగ్గా అప్పుడు సంభవిస్తుంది దానికై అది..
"అమనస్కస్థితి" ! ధ్యానం కూడా అది ఏదో పనిలా చేయాలి చేయాలి అని కూర్చోకండి... ధ్యానం లోకీ మీ లోపలికి ప్రయాణిచడం సహజగా జరిగే ప్రక్రియా... అందుకే బుద్ధుడు సజంగా జరిగే శ్వాసని గమనించమని చెప్పరు... ఆ శ్వాస మీ అంతరా ఆత్మ స్థితికి సహజంగా తీసుకోపోతుంది... ఆధ్యాత్మిక లోకి మీరు సజంగా వస్తారు ఏదో పొందడని ఏదో సమాజాన్ని
ఉద్దారించడని వచ్చేది కాదు... నిన్ను నువ్వు తెలుసుకోడానికి నీలో జీవితం ఖాళీ ఏర్పడితేనే నీలోకి ప్రయనించగలవు ధ్యానం ప్రచారాలు చేసి జనని పోగుచేస్తే వాళ్ళ ప్రాపంచిక కోరికల చిట్టతో ధ్యానం ప్రారంభిస్తారు.. వాళ్ళకి ఆశలు చూపి ధ్యానం లోకి తీసుకోవస్తారు ఆ అన్వేషణ ప్రాపంచికం.. నిజమైన ఆత్మ ప్రయాణం చాలా సజమైంది సున్నితమైంది సరళమైనది... ఎందుకంటే అన్వేషణ ఆలోచనాపరమైంది.
ముక్తి, నిర్వాణం ఆలోచనా రాహిత్యస్థితి. ధ్యానం భావతిత స్థితి.. ధ్యానం స్థితి లో నేను ఈ శరీరం మాత్రమే కాదు ఈ శరీర స్థితిని ధాటి శున్య స్థితిలో కీ ప్రయాణం జరుగుతుంది... ఇక నిర్వణా ప్రయాణం సహజంగా జరిగి ఆత్మ స్థితి కీ చేరుకుంటారు...
No comments:
Post a Comment